Apple iPad Air: యాపిల్ కొత్త ఐప్యాడ్‌లు లాంచ్.. మార్చి 21 నుంచి విక్రయాలు!
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ (Apple) రెండు కొత్త ఐప్యాడ్‌లను విడుదల చేసింది.
గతేడాది లాంచ్ చేసిన ఐప్యాడ్‌లు విపరీతమైన ఆదరణ పొందిన నేపథ్యంలో, ఇప్పుడు మరింత మెరుగైన ఫీచర్లతో ఐప్యాడ్ ఎయిర్ (2025), ఐప్యాడ్ (2025) మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇందులో ఐప్యాడ్ ఎయిర్ యాపిల్ ఎం3 చిప్‌తో వస్తుండగా, ఐప్యాడ్ (2025) ఏ16 బయోనిక్ చిప్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు టాబ్లెట్‌ల ఫీచర్లు, ధరలు ఇప్పుడు చూద్దాం.
Details
ఐప్యాడ్ ఎయిర్ (2025)
యాపిల్ ఎం3 చిప్‌తో పనిచేసే ఈ కొత్త ఐప్యాడ్ ఎయిర్, గత మోడల్ కంటే రెండింతలు వేగంగా పనిచేస్తుందని కంపెనీ వెల్లడించింది.
యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను సపోర్ట్ చేసే ఐప్యాడ్‌ఓఎస్ 18 పై నడుస్తుంది.
అలాగే, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ కలిగి ఉంది. 11 అంగుళాల వైఫై మోడల్ రూ. 59,900 నుంచి ప్రారంభం కానుంది.
వైఫై + సెల్యులార్ మోడల్ ధర రూ. 74,900 నుంచి, 13 అంగుళాల వైఫై మోడల్ రూ. 79,900, 13 అంగుళాల వైఫై + సెల్యులార్ మోడల్ రూ. 94,900వేలు ఉంది. ఈ ఐప్యాడ్ బ్లూ, పర్పుల్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
Details
ఐప్యాడ్ (2025)
ఏ16 బయోనిక్ చిప్‌తో రాబోతున్న ఈ కొత్త ఐప్యాడ్, ఐఫోన్‌ఓఎస్ 18 పై పనిచేస్తుంది. అయితే, ఇది యాపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేయదు.
12 ఎంపీ వెనుక కెమెరా, 12 ఎంపీ ఫ్రంట్ కెమెరాతో వస్తోంది. బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ, వైఫై సపోర్ట్ కలిగి ఉంది.
వైఫై మోడల్ రూ.34,90, వైఫై + సెల్యులార్ మోడల్ రూ. 49,900, మ్యాజిక్ కీబోర్డ్ రూ. 24,900గా నిర్ణయించారు. ఈ ఐప్యాడ్ బ్లూ, పింక్, సిల్వర్, ఎల్లో కలర్ వేరియంట్లలో లభిస్తుంది.
ఈ రెండు కొత్త ఐప్యాడ్‌లకు ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యాయి. మార్చి 21 నుంచి వీటి విక్రయాలు అధికారికంగా ప్రారంభం కానున్నాయి.