Apple: సిరి AI అప్‌గ్రేడ్ కోసం గూగుల్ జెమినీని ఎంచుకున్న ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సామర్థ్యాలను మెరుగుపరచడానికి గూగుల్‌తో భాగస్వామ్యం అయ్యిందని ప్రకటించింది. దీంతో ప్రధానంగా సిరి (Siri) వాయిస్ అసిస్టెంట్‌లో పెద్ద అప్‌గ్రేడ్ జరుగనున్నది. ఈ దీర్ఘకాల సహకారం ద్వారా గూగుల్ జెమినీ,క్లౌడ్ సాంకేతికతను ఉపయోగించి భవిష్యత్తులో ఆపిల్ ఫౌండేషన్ మోడల్స్ (Apple Foundation Models) కోసం ఆధారమైన సాంకేతికతను రూపొందించనున్నారు. "వివిధ అవకాశాలను పరిశీలించిన తర్వాత, గూగుల్ సాంకేతికత ఆపిల్ ఫౌండేషన్ మోడల్స్‌కి అత్యంత సామర్థ్యవంతమైన పునాది అందిస్తుంది అని మేము నిర్ణయించుకున్నాం. దీని వల్ల మన వినియోగదారుల కోసం కొత్త, వినూత్న అనుభవాలను సృష్టించగలమని మేము ఆనందంగా ఉన్నాము" అని ఆపిల్ ఒక ప్రకటనలో తెలిపింది.
వివారాలు
ఆపిల్ AI ఫీచర్లు ప్రైవేట్ క్లౌడ్‌లో నడుస్తాయి
జెమినీ మోడల్స్‌ను ఆపిల్ డివైసెస్‌లో ఇంటిగ్రేట్ చేసి, కంపెనీ ప్రైవేట్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో నడిపించనున్నారు. ప్రస్తుతం, ఈ డీల్ షరతులపై కంపెనీ ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆగస్టులో, బ్లూమ్‌బర్గ్ ఒక రిపోర్ట్‌లో, ఆపిల్ కొత్త సిరి వెర్షన్ కోసం గూగుల్ జెమినీ కస్టమ్ మోడల్‌పై చర్చలలో ఉన్నట్లు తెలిపింది. ఆ రిపోర్ట్‌లో, ఆపిల్ ప్రతి ఏడాది గూగుల్ AI సేవలకు సుమారు $1 బిలియన్ చెల్లించే అవకాశం ఉన్నట్లు కూడా పేర్కొన్నారు.
వివరాలు
ఆపిల్ AI అప్‌గ్రేడ్ 2026కి వాయిదా పడింది
నవంబర్ 2022లో OpenAI ChatGPT లాంచ్ తర్వాత AI బూమ్ మధ్య ఆపిల్ నిశ్శబ్దంగా ఉండగా, ఇతర టెక్ దిగ్గజాలు—అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్—వినియోగదారుల కోసం AI ఉత్పత్తులు, మౌలిక సదుపాయాలలో బిలియన్ల Dollers పెట్టుబడులు పెట్టాయి. దీంతో ఆపిల్‌పై సిరి AI వాయిస్ అప్‌గ్రేడ్‌ను వాయిదా లేకుండా డెలివర్ చేయాలన్న ఒత్తిడి పెరిగింది. ఈ అప్‌గ్రేడ్, WWDC 2024లో ప్రకటన అయినప్పటికీ, 2026కి వాయిదా పడింది.