LOADING...
Apple: మార్చిలో ఆపిల్ బిగ్ బ్లాస్ట్?.. ఐఫోన్ 17e నుంచి ఐప్యాడ్ వరకూ!
మార్చిలో ఆపిల్ బిగ్ బ్లాస్ట్?.. ఐఫోన్ 17e నుంచి ఐప్యాడ్ వరకూ!

Apple: మార్చిలో ఆపిల్ బిగ్ బ్లాస్ట్?.. ఐఫోన్ 17e నుంచి ఐప్యాడ్ వరకూ!

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 23, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి మార్కెట్‌లో సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోంది. మార్చి 2 నుంచి మార్చి 4 వరకు మూడు రోజుల పాటు భారీ ప్రొడక్ట్ లాంచ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ తెలిపింది. సాధారణంగా ఒక్కరోజు కీనోట్‌తో సరిపెట్టే ఆపిల్ ఈసారి ఫార్మాట్ మార్చి మూడు రోజుల ప్రకటనల సిరీస్‌గా నిర్వహించనుండటం విశేషం. చివరి రోజును "స్పెషల్ ఆపిల్ ఎక్స్‌పీరియెన్స్"గా నిర్వహించి, న్యూయార్క్ సిటీ, లండన్, షాంఘై నగరాల్లో ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులకు హ్యాండ్స్-ఆన్ సెషన్లు ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ ఈవెంట్‌లో కనీసం ఐదు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించే అవకాశం ఉందని అంచనా.

వివరాలు 

A18 ప్రాసెసర్‌తో ఎంట్రీ లెవల్ ఐప్యాడ్

కొత్త డిజైన్‌తో బడ్జెట్ మ్యాక్‌బుక్, గత ఏడాది మోడల్‌కు అప్‌డేటెడ్ వెర్షన్‌గా iPhone 17e, రీఫ్రెష్ చేసిన MacBook Pro, MacBook Air మోడళ్లు, M4 చిప్‌తో iPad Air, అలాగే A18 ప్రాసెసర్‌తో ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ విడుదలయ్యే ఛాన్స్ ఉందని టెక్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం iPhone 16e, ప్రస్తుత ఐప్యాడ్ ఎయిర్ మోడళ్లు, M4 మ్యాక్‌బుక్ ఎయిర్ వేరియంట్లు, హైఎండ్ మ్యాక్‌బుక్ ప్రో స్టాక్స్ గ్లోబల్‌గా తగ్గిపోవడం కొత్త మోడళ్ల రాకకు సంకేతమనే చర్చ సాగుతోంది.

వివరాలు 

మార్చి 2 వారం ఆపిల్‌ అత్యంత బిజీ

ఇదిలా ఉండగా 2026 ప్రారంభంలో రీఫ్రెష్ చేసిన Mac Studio డెస్క్‌టాప్‌లు, కొత్త ఆపిల్ స్టూడియో డిస్ప్లే కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఉత్పత్తులే కాకుండా లాంచ్ విధానంలోనూ మార్పులు చేస్తూ, బ్లాక్‌బస్టర్ కీనోట్‌కు బదులుగా విడతల వారీగా ప్రకటనలు చేయడం ద్వారా కొత్త స్టైల్‌ను ఆపిల్ ప్రయత్నిస్తోంది. మొత్తానికి మార్చి 2 వారం ఆపిల్‌కు అత్యంత బిజీగా మారబోతోందనే టాక్ వినిపిస్తోంది.

Advertisement