Apple: యాప్ డెవలపర్ల కోసం కొత్త మార్పులు.. 100కు పైగా మెట్రిక్స్‌తో ఆపిల్ అప్‌డేట్
ఈ వార్తాకథనం ఏంటి
యాప్ డెవలపర్లకు మరింత సహాయం చేయాలనే లక్ష్యంతో ఆపిల్ తన App Store Connect సేవను భారీగా అప్‌డేట్ చేసింది. ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా డెవలపర్లు తమ యాప్‌లను ప్రచురించడం, నిర్వహించడం, పనితీరును ట్రాక్ చేయడం చేస్తారు. తాజా అప్‌డేట్‌లో 100కు పైగా కొత్త మెట్రిక్స్‌ను జోడించారు. వీటిలో ముఖ్యంగా ఆదాయం (మోనిటైజేషన్), సబ్‌స్క్రిప్షన్ డేటా వంటి అంశాలు ఉన్నాయి. దీంతో యాప్‌లో జరిగే కొనుగోళ్లు, ఆఫర్ల ప్రభావం గురించి డెవలపర్లు స్పష్టంగా అర్థం చేసుకోగలరు.
వివరాలు
అంచనాలు కాదు.. ఆపిల్ డేటాపైనే మెట్రిక్స్
కొత్తగా అందించిన మెట్రిక్స్‌కు ప్రత్యేకత ఏమిటంటే ఇవి యాపిల్ స్వంత డేటాపైనే ఆధారపడి ఉంటాయి. మూడోపక్ష సేవలు అయిన data.ai, Sensor Tower లాంటి వాటిలా అంచనాలు కాదు. అలాగే కొత్త సబ్‌స్క్రిప్షన్ రిపోర్టులను API ద్వారా ఎక్స్‌పోర్ట్ చేసుకునే సౌకర్యం కూడా ఇచ్చారు. దీని వల్ల డెవలపర్లు తమ డేటాను ఆఫ్‌లైన్‌లో విశ్లేషించుకోవచ్చు లేదా తమ సిస్టమ్స్‌లోకి దిగుమతి చేసుకోవచ్చు.
వివరాలు
యూజర్ ప్రవర్తనపై లోతైన విశ్లేషణ
ఈ అప్‌డేట్‌తో యూజర్ల ప్రవర్తనను లోతుగా విశ్లేషించే ఆధునిక టూల్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. డౌన్‌లోడ్ తేదీ, సోర్స్, ఆఫర్ ప్రారంభ తేదీ వంటి వివరాలను విశ్లేషించవచ్చు. దీని ద్వారా ఒక యూజర్ గ్రూప్ యాప్‌తో ఎలా ఇంటరాక్ట్ అయిందో కాలక్రమంలో చూడవచ్చు. అదనంగా, కొత్త peer group బెంచ్‌మార్క్‌లను కూడా తీసుకువచ్చారు. వీటి ద్వారా డౌన్‌లోడ్ నుంచి పేడ్ కన్వర్షన్, ప్రతి డౌన్‌లోడ్‌పై ఆదాయం వంటి అంశాల్లో పోటీదారులతో పోల్చుకోవచ్చు.
వివరాలు
ప్రైవసీకి ప్రాధాన్యం… ఆపిల్ హామీ
యూజర్ల ప్రైవసీ రక్షణ కోసం యాపిల్ aggregated cohort dataనే ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే వ్యక్తిగత డెవలపర్ పనితీరును రక్షించడానికి differential privacy టెక్నిక్స్‌ను ఉపయోగిస్తున్నట్లు వెల్లడించింది. App Store Connectలో మెట్రిక్స్‌ను చూడేటప్పుడు కొత్త ఫిల్టర్లను ఉపయోగించి మరింత లోతైన విశ్లేషణ చేయవచ్చు. ఒకేసారి గరిష్టంగా ఏడు ఫిల్టర్లను ఉపయోగించుకునే అవకాశం ఉంది.
వివరాలు
కొత్త App Store Analytics గైడ్ విడుదల
ఈ అప్‌డేట్‌తో పాటు App Store Connectలో Help సెక్షన్‌లో కొత్త App Store Analytics Guideను కూడా ఆపిల్ విడుదల చేసింది. డేటా ఆధారిత వ్యూహాలను రూపొందించుకోవడానికి, అందుబాటులో ఉన్న టూల్స్‌ను సరిగ్గా అర్థం చేసుకోవడానికి ఈ గైడ్ ఉపయోగపడుతుంది. డెవలపర్లకు మెరుగైన విశ్లేషణ సదుపాయాలను అందించాలనే యాపిల్ లక్ష్యాన్ని ఇది మరింత స్పష్టం చేస్తోంది.