AI health coach: కొత్త వాచ్‌లతో యాపిల్ AI హెల్త్ కోచ్.. త్వరలోనే అందుబాటులోకి?
ఈ వార్తాకథనం ఏంటి
యాపిల్ తన హెల్త్ యాప్‌ను భారీగా అప్‌గ్రేడ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత హెల్త్ కోచ్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫీచర్లను వచ్చే నెలలోనే యాపిల్ పరిచయం చేసే అవకాశం ఉందని సమాచారం. వాస్తవానికి ఈ అప్‌డేట్‌ను iOS 26.4లోనే తీసుకురావాలని తొలుత భావించారు. అయితే కొన్ని కారణాలతో ఇది ఆలస్యమైంది. ఇప్పుడు కొత్త Apple Watch Series 12, Ultra 4 త్వరలో మార్కెట్‌లోకి రానున్న నేపథ్యంలో.. వాటితో పాటే ఈ కొత్త హెల్త్ ఫీచర్లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
వివరాలు
సెప్టెంబర్‌లో కొత్త ఫీచర్లను ప్రకటించడం యాపిల్‌కు అలవాటే..
కొత్త హార్డ్‌వేర్ అవసరం లేని సాఫ్ట్‌వేర్ ఫీచర్లను కూడా సెప్టెంబర్‌లో జరిగే ఈవెంట్లలో యాపిల్ ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి.
ఉదాహరణకు watchOS 9లో తీసుకొచ్చిన Low Power Mode, watchOS 11లో ప్రవేశపెట్టిన Sleep Apnea Detection, watchOS 26లో అందించిన Hypertension Notifications వంటి ఫీచర్లను సెప్టెంబర్‌లో జరిగిన యాపిల్ ఈవెంట్లలోనే వెల్లడించింది.
దీంతో ఈసారి కూడా అప్‌గ్రేడ్ చేసిన హెల్త్ యాప్‌ను వచ్చే నెలలో యాపిల్ ప్రకటించే అవకాశం ఉందనే అంచనాలు పెరిగాయి.
వివరాలు
Project Mulberryపై ఇంకా స్పష్టత లేదు..
అయితే సెప్టెంబర్‌లో ఫీచర్లను ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ.. Project Mulberry కూడా అదే ఈవెంట్‌లో అధికారికంగా పరిచయం అవుతుందనే గ్యారెంటీ లేదు.
కొత్త హెల్త్ యాప్ అప్‌గ్రేడ్స్‌ను WWDC27లో కూడా ప్రకటించకపోవచ్చని బ్లూమ్‌బర్గ్‌కు చెందిన మార్క్ గుర్మన్ గతంలో వెల్లడించారు.
యాపిల్ హెల్త్ యాప్‌లో ప్రస్తుతం అనేక కొత్త AI ఫీచర్లను అభివృద్ధి చేస్తోంది.
వీటిని తొలుత 'Mulberry' అనే అంతర్గత ప్రాజెక్ట్ పేరుతో సమగ్ర హెల్త్ కోచ్ సేవగా అందించాలని యాపిల్ భావించింది.
అయితే ఆ ప్రాజెక్ట్‌ను తర్వాత కొంత పరిమితం చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
హెల్త్ యాప్‌లో కీలక మార్పులు..
కొత్త అప్‌డేట్‌తో యాపిల్ హెల్త్ యాప్‌లో రక్తంలో చక్కెర స్థాయులకు సంబంధించిన ట్రాకింగ్‌ను మరింత మెరుగుపరచనుంది.
అలాగే కెమెరా సాయంతో వర్కౌట్‌లను పర్యవేక్షించే ఫీచర్‌ను కూడా తీసుకురానుంది.
వీటితో పాటు హెల్త్ యాప్ డిజైన్‌లో కూడా భారీ మార్పులు చేయనుంది.
యూజర్లు తమ ఆరోగ్యానికి సంబంధించిన వివిధ డేటాను మరింత సులభంగా అర్థం చేసుకునేలా కొత్త డిజైన్‌ను రూపొందిస్తోంది.
మరోవైపు.. వైద్యుల వీడియోలతో ప్రత్యేకంగా 'Health+' అనే సర్వీస్‌ను ప్రారంభించాలని యాపిల్ తొలుత భావించింది. అయితే ఆ ప్లాన్‌ను మార్చుకున్నట్లు తెలుస్తోంది.
ప్రత్యేక Health+ సేవగా కాకుండా.. ఈ ఫీచర్లను సాధారణ Apple Health యాప్‌లోనే అందించాలని కంపెనీ నిర్ణయించినట్లు సమాచారం.