Loading...
Apple: కెమెరాతో కొత్త ఎయిర్‌పాడ్స్.. ఆపిల్‌ నుంచి సంచలన ఆవిష్కరణ!
కెమెరాతో కొత్త ఎయిర్‌పాడ్స్.. ఆపిల్‌ నుంచి సంచలన ఆవిష్కరణ!

Apple: కెమెరాతో కొత్త ఎయిర్‌పాడ్స్.. ఆపిల్‌ నుంచి సంచలన ఆవిష్కరణ!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 18, 2026
10:03 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్‌ కొత్త తరం ఎయిర్‌పాడ్స్‌పై పనిచేస్తున్నట్లు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈసారి సాధారణ వైర్‌లెస్‌ ఇయర్‌బడ్స్‌కు భిన్నంగా కెమెరాలను అమర్చిన ఎయిర్‌పాడ్స్‌ను తీసుకురావడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ లీక్‌ ఈ కొత్త డివైజ్‌ ఎలా పనిచేస్తుందనే దానిపై ఆసక్తికర వివరాలను వెల్లడించింది. మ్యాక్‌రూమర్స్‌ గుర్తించిన ఈ వీడియో మ్యాక్‌ఓఎస్‌ టాహో 26.7 రిలీజ్‌ క్యాండిడేట్‌లో కనిపించింది. ఇందులో ఇంకా అధికారికంగా విడుదల కాని కెమెరా ఎయిర్‌పాడ్స్‌ డెమోను చూపించారు.

వివరాలు 

కెమెరా ఎలా పనిచేస్తుంది?

లీకైన వీడియోలో ఓ వ్యక్తి చేతిలో ఓ పుస్తకాన్ని పట్టుకుని ఉండగా..ఎయిర్‌పాడ్స్‌లోని కెమెరా ఆ పుస్తకాన్ని చూస్తుంది.

ముఖ్యంగా దాని టైటిల్‌ను కెమెరా గుర్తించే విధానాన్ని వీడియోలో చూపించారు.

మనచుట్టూ ఉన్న వస్తువులను గుర్తించి,వాటి సమాచారాన్ని తర్వాత ఉపయోగించుకునేలా సేవ్‌ చేసుకోవడానికి 'విజువల్‌ ఇంటెలిజెన్స్‌'ను ఉపయోగించవచ్చని వీడియోలోని వ్యాఖ్యాత వివరిస్తారు.

దీన్నిబట్టి చూస్తే ఎయిర్‌పాడ్స్‌లోని కెమెరాలు సాధారణంగా ఫొటోలు,వీడియోలు తీసుకోవడానికి కాకుండా విజువల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం ఉపయోగించే అవకాశం ఉంది.

మనం ఏ వస్తువును చూస్తున్నామో సిరి గుర్తించి,దానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పడం లేదా మన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం వంటి పనులు చేయగలదని తెలుస్తోంది.

అంటే మన చుట్టూ ఉన్న విషయాల గురించి ఎయిర్‌పాడ్స్‌ ద్వారా సిరిని ప్రశ్నించే అవకాశం ఉండొచ్చు.

వివరాలు 

కొత్త ఎయిర్‌పాడ్స్‌లో ఇతర ఫీచర్లు

లీక్‌ ప్రకారం ఈ కెమెరాలు ప్రధానంగా విజువల్‌ ఇంటెలిజెన్స్‌ కోసం ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది.

సాధారణ కెమెరాల మాదిరిగా ఫొటోలు, వీడియోలు తీసే ఫీచర్‌ ఉండకపోవచ్చని సమాచారం.

దీంతో వినియోగదారులు తమ పరిసరాలను చూసినప్పుడు వాటికి సంబంధించిన సమాచారాన్ని సిరి ఏఐ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది.

డెమోలో మరో ఆసక్తికరమైన అంశం కూడా కనిపించింది. ఎయిర్‌పాడ్స్‌ను జుట్టు కప్పేసినప్పుడు వినియోగదారులకు హెచ్చరిక వచ్చే అవకాశం ఉన్నట్లు వీడియో సూచిస్తోంది.

అంటే కెమెరాలకు స్పష్టమైన దృశ్యం కనిపించేలా ఎయిర్‌పాడ్స్‌ ఉండటం చాలా ముఖ్యమని తెలుస్తోంది.

కెమెరా ముందు అడ్డంకులు ఉంటే విజువల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు సరిగ్గా పనిచేయకపోవచ్చని దీని ద్వారా అర్థమవుతోంది.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త ఎయిర్‌పాడ్స్‌ అభివృద్ధి

ఆపిల్‌ ఈ కొత్త ఎయిర్‌పాడ్స్‌ను 'B790' అనే కోడ్‌నేమ్‌తో సుమారు నాలుగేళ్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. మ్యాక్‌ఓఎస్‌ టాహో 26.7 రిలీజ్‌లో B790 ప్రొడక్ట్‌కు సంబంధించిన పలు రిఫరెన్స్‌లు కనిపించినట్లు లీక్‌ వెల్లడించింది.

అంతేకాదు, ఇంకా మార్కెట్లోకి రాని పలు యాపిల్‌ డివైజ్‌లకు సంబంధించిన వివరాలు కూడా ఈ సాఫ్ట్‌వేర్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదే సమయంలో యాపిల్‌ మరో కెమెరా ఎయిర్‌పాడ్స్‌ ప్రాజెక్టుపైనా పనిచేస్తున్నట్లు సమాచారం. దీనికి 'B798' అనే కోడ్‌నేమ్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

దీంతో కెమెరాలతో కూడిన ఎయిర్‌పాడ్స్‌ టెక్నాలజీపై యాపిల్‌ గట్టిగానే దృష్టి పెట్టినట్లు టెక్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

కొత్త ఎయిర్‌పాడ్స్‌ ఎప్పుడు విడుదలవుతాయి?

కెమెరా ఉన్న కొత్త ఎయిర్‌పాడ్స్‌ను ఈ ఏడాది చివర్లో యాపిల్‌ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

ముఖ్యంగా సెప్టెంబరులో జరిగే ఆపిల్‌ ఈవెంట్‌లో వీటిని పరిచయం చేసే అవకాశం ఉందనే అంచనాలు ఉన్నాయి.

అయితే ఇప్పటివరకు కంపెనీ ఈ ఉత్పత్తిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.

లీక్‌లోని సమాచారం నిజమైతే,ఐఫోన్‌ 18ప్రో సిరీస్‌, ఐఫోన్‌ ఫోల్డ్‌తో పాటు ఈ కొత్త ఎయిర్‌పాడ్స్‌ కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కెమెరాలు,విజువల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి కొత్త ఫీచర్లు ఉండటంతో ప్రస్తుత ఎయిర్‌పాడ్స్‌ మోడళ్ల కంటే వీటి ధర ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

ముఖ్యంగా AirPods Pro 3 కంటే ఈ కొత్త కెమెరా ఎయిర్‌పాడ్స్‌ ఖరీదైనవిగా ఉండొచ్చని అంచనా.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కెమెరాలతో రాబోయే AirPods 

ADVERTISEMENT