Apple: ఆపిల్ ఫోల్డబుల్ ఐఫోన్‌కు సాంకేతిక సమస్యలు.. విడుదల ఆలస్యం అయ్యే అవకాశం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ టెక్ దిగ్గజం ఆపిల్ తయారు చేస్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ అభివృద్ధిలో సాంకేతిక సమస్యలు ఎదురవుతున్నట్లు Nikkei Asia వెల్లడించింది. టెస్ట్ ప్రొడక్షన్ ప్రారంభ దశలో ఊహించిన దానికంటే ఎక్కువ సమస్యలు బయటపడినట్లు సమాచారం. ఈ సమస్యలను పరిష్కరించడానికి ఇంకా సమయం అవసరమని, డిజైన్‌లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఈ ఇంజినీరింగ్ సమస్యల కారణంగా ఫోల్డబుల్ ఐఫోన్ భారీ ఉత్పత్తి, మార్కెట్‌కు పంపిణీ షెడ్యూల్ ఆలస్యమయ్యే అవకాశముంది. ముందుగా ఈ ఫోన్‌ను 2026 రెండోార్థంలో, కొత్త ఫ్లాగ్‌షిప్ సిరీస్‌తో కలిసి విడుదల చేస్తారని భావించారు. అయితే ప్రస్తుతం ఉన్న సాంకేతిక అడ్డంకులు త్వరగా పరిష్కారం కాకపోతే విడుదల మరింత ఆలస్యం కావచ్చని అంచనా వేస్తున్నారు.
వివరాలు
iPhone Fold నుండి ఏమి ఆశించవచ్చు?
డిజైన్ పరంగా ఈ ఫోల్డబుల్ ఐఫోన్, శాంసంగ్ తయారు చేస్తున్న Galaxy Z Fold series లాంటి బుక్ స్టైల్ ఫోల్డింగ్ మోడల్‌లో ఉండే అవకాశముంది. ఇందులో 7.8 అంగుళాల లోపలి డిస్‌ప్లే, 5.5 అంగుళాల బయట డిస్‌ప్లే ఉండొచ్చని టెక్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 3D ప్రింటెడ్ హింజ్ టెక్నాలజీ కూడా ఉండొచ్చని ప్రచారం. ధర విషయానికి వస్తే, ఈ ఫోల్డబుల్ ఐఫోన్ అమెరికాలో సుమారు $1,999 (దాదాపు ₹1.84 లక్షలు), చైనాలో CNY 15,999 (దాదాపు ₹2.14 లక్షలు) ఉండొచ్చని అంచనా. దీంతో ఇది ప్రీమియం సెగ్మెంట్‌లోకి వచ్చే హైఎండ్ డివైస్‌గా నిలవనుంది.