LOADING...
iPhone 17 Pro: లాంచ్ కి ముందు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లుక్ లీక్..  
లాంచ్ కి ముందు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లుక్ లీక్..

iPhone 17 Pro: లాంచ్ కి ముందు ఆపిల్ ఐఫోన్ 17 ప్రో లుక్ లీక్..  

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 29, 2025
03:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆపిల్ సంస్థ తన తాజా ఐఫోన్ 17 సిరీస్‌ను త్వరలో మార్కెట్‌లోకి విడుదల చేయనున్నది. ఈ సిరీస్‌లో ప్రత్యేకంగా ఐఫోన్ 17 ప్రోకు గణనీయమైన ఆసక్తి నెలకొంది. 2025 సంవత్సరంలో విడుదలకానున్న ప్రధాన స్మార్ట్‌ఫోన్‌లలో ఇది ఒకటిగా భావించబడుతోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అనేక లీక్‌లు ఇప్పటికే బయటపడ్డాయి. ఈసారి ఆపిల్ డిజైన్ నుంచి కెమెరా ఫీచర్ల వరకూ విస్తృతమైన మార్పులు చేయనున్నట్లు అనేక రిపోర్టులు చెబుతున్నాయి. తాజాగా ఐఫోన్ 17 ప్రో తొలి లుక్ కూడా వెలుగులోకి వచ్చింది. ఇటీవల ఒక వ్యక్తి చేతిలో ఐఫోన్ 17 ప్రో ఉన్న దృశ్యం ఒక ఫొటోలో కనిపించి ఆసక్తి రేకెత్తించింది.

వివరాలు 

ఐఫోన్ 17 ఎయిర్' కొత్త మోడల్‌

ఈ స్మార్ట్‌ఫోన్ అధికారికంగా సెప్టెంబర్ నెలలో విడుదల కానుంది.ఐఫోన్ 17 లైనప్‌లో ఈ హైఎండ్ వేరియంట్‌కి ప్రత్యేక స్థానం ఉండనుంది. ఈ లైనప్‌లో స్టాండర్డ్ ఐఫోన్ 17, అత్యున్నత వేరియంట్ అయిన ఐఫోన్ 17ప్రో మాక్స్‌తో పాటు 'ఐఫోన్ 17 ఎయిర్' అనే కొత్త మోడల్‌ను కూడా ఆపిల్ ప్రవేశపెట్టనుంది. వచ్చే ఐఫోన్ 17 ప్రో మోడల్‌ కెమెరా పనితీరులో గణనీయమైన మెరుగుదల ఉండనుందని తెలుస్తోంది. ఇందులో మెరుగైన టెలిఫోటో జూమ్ లెన్స్‌తో పాటు,ప్రొఫెషనల్ స్థాయి ఫోటోలు, వీడియోలు తీర్చిదిద్దేందుకు ప్రత్యేకంగా రూపొందించిన కొత్త ప్రో ఎడిషన్ కెమెరా యాప్‌ కూడా ఉండనుంది. మాక్‌రూమర్స్ తెలిపిన నివేదిక ప్రకారం, ఐఫోన్ 17ప్రో మోడల్ 8x ఆప్టికల్ జూమ్‌కు సామర్థ్యమైన టెలిఫోటో లెన్స్‌తో రానున్నది.

వివరాలు 

కెమెరా నియంత్రణ బటన్‌ ఏర్పాటు

ఇది గత ఐఫోన్ 16 సిరీస్‌లోని 5x జూమ్ సామర్థ్యానికి ఒక పెద్ద అప్‌గ్రేడ్‌గా భావించవచ్చు. ఈ ఫోన్‌తో ప్రొఫెషనల్ స్థాయి కెమెరా యాప్‌ను కూడా ఆపిల్ అందించనుందని సమాచారం. అంతేకాక, హ్యాండ్‌సెట్ పై అంచున అదనంగా కెమెరా నియంత్రణ బటన్‌ను కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. విడుదలైన ఫోటో ప్రకారం, కెమెరా బార్ ఎడమ వైపున మూడు లెన్స్‌లు ఉండగా, కుడి వైపున LiDAR స్కానర్, LED ఫ్లాష్‌ను చూడవచ్చు.

వివరాలు 

కెమెరా మాడ్యూల్‌ను ఫోన్ వెడల్పుకు విస్తరించారు 

ఇక డిజైన్ విషయానికి వస్తే, తాజా లీక్‌ల ప్రకారం ఐఫోన్ 17 ప్రోను చూడ్డానికి ఐఫోన్ 16 ప్రో మోడల్‌ను పోలి ఉంటుందని భావిస్తున్నారు. ముందు భాగంలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చన్న అభిప్రాయాలున్నాయి. అయితే, వెనుక భాగంలో కెమెరా సెటప్‌కి సంబంధించి ఒక కొత్త రీతిలో డిజైన్‌ను రూపొందించినట్లు సమాచారం. ఇక ట్రిపుల్ లెన్స్ సెటప్ మునుపటిలాగే కొనసాగించినా, ఈసారి కెమెరా మాడ్యూల్‌ను ఫోన్ వెడల్పుకు విస్తరించి, డివైస్ కలర్‌కు తగిన కొత్త హారిజాంటల్ ప్యానెల్‌లో అమర్చినట్టు తెలుస్తోంది.