Apple: మ్యాక్ ప్రో కోసం ఎక్స్‌ట్రీమ్ చిప్‌లను రద్దు చేసిన ఆపిల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ తన మ్యాక్ ప్రో కంప్యూటర్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ఎం2 ఎక్స్‌ట్రీమ్,ఎం3 ఎక్స్‌ట్రీమ్ చిప్‌లను మార్కెట్లోకి తీసుకురాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని బ్లూమ్‌బర్గ్ జర్నలిస్ట్ మార్క్ గుర్‌మన్ తన తాజా పవర్ ఆన్ న్యూస్‌లెటర్‌లో వెల్లడించారు. ఆపిల్ ఇప్పటికే ఉన్న అల్ట్రా సిరీస్ ప్రాసెసర్‌ల కంటే రెండింతల CPU,GPU కోర్‌లతో ఈ కొత్త చిప్‌లను రూపొందించాలని ప్రణాళిక వేసింది. ఈఎక్స్‌ట్రీమ్ చిప్‌ల ద్వారా మ్యాక్ ప్రో వినియోగదారులకు మరింత శక్తివంతమైన పనితీరు అందించాలని ఆపిల్ భావించింది. అల్ట్రా చిప్‌ల కంటే రెట్టింపు గ్రాఫిక్స్, ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని అందించేలా వీటిని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేసింది. అల్ట్రా కంటే ఉన్నత స్థాయి చిప్‌కు"ఎక్స్‌ట్రీమ్"అనే పేరు సరైనదిగా భావించినట్లు మార్క్ గుర్‌మన్ పేర్కొన్నారు.
వివరాలు
రెండు దశాబ్దాలుగా కొనసాగిన మ్యాక్ ప్రో ప్రయాణానికి తెర
అయితే, ఈ ప్రాజెక్ట్‌ను యాపిల్ చివరకు విరమించుకుంది. అధిక ఉత్పత్తి వ్యయాలు, మ్యాక్ ప్రోకు తక్కువ డిమాండ్ ఉండటమే ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.
ఎక్స్‌ట్రీమ్ చిప్‌ల అభివృద్ధిని నిలిపివేయడమే కాకుండా, ఈ ఏడాది ప్రారంభంలో మ్యాక్ ప్రో ఉత్పత్తి శ్రేణికీ ఆపిల్ ముగింపు పలికింది.
దీంతో దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగిన మ్యాక్ ప్రో ప్రయాణానికి తెరపడింది.
మ్యాక్ ప్రోకు చివరిసారిగా 2019లో భారీ మార్పులతో కొత్త డిజైన్‌ను పరిచయం చేశారు.
అదే సమయంలో ప్రో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్‌ను కూడా విడుదల చేశారు. ప్రారంభంలో ఇంటెల్ ప్రాసెసర్‌లతో వచ్చిన ఈ డెస్క్‌టాప్‌ను, 2023 జూన్‌లో ఎం2 అల్ట్రా చిప్‌తో అప్‌డేట్ చేశారు.
వివరాలు
ఆపిల్ నిర్ణయంపై ప్రభావం
ఆ తర్వాత కొత్త హార్డ్‌వేర్ అప్‌డేట్‌లు లేకపోయినా, 6,999 డాలర్ల ప్రారంభ ధరతో యాపిల్ దీన్ని విక్రయిస్తూ వచ్చింది.
ఇదే సమయంలో మరింత శక్తివంతమైన ఎం3 అల్ట్రా చిప్‌తో మ్యాక్ స్టూడియోను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా చిప్‌ల కొరత, విడిభాగాల ధరల పెరుగుదల, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం వంటి అంశాలు కూడా ఆపిల్ నిర్ణయంపై ప్రభావం చూపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితుల్లో ఖరీదైన ఉత్పత్తులను కొనసాగించడం కంపెనీలకు సవాలుగా మారింది.
మ్యాక్ ప్రోను నిలిపివేయడంతో, యాపిల్ హై-పర్‌ఫార్మెన్స్ డెస్క్‌టాప్ విభాగంలో మ్యాక్ స్టూడియోనే ప్రధాన ఉత్పత్తిగా నిలిచే అవకాశం కనిపిస్తోంది.