Apple: Apple AI యాప్ స్టోర్ ప్లాన్.. సిరిలో థర్డ్ పార్టీ చాట్‌బాట్స్‌కు గ్రీన్ సిగ్నల్!
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ సంస్థ ఈ ఏడాది AI రంగంలో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది. Apple Inc. త్వరలో విడుదల కానున్న iOS 27లో అప్డేటెడ్ Siriని తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ కొత్త సిరికి గూగుల్ రూపొందించిన జెమినీ మోడల్స్ సపోర్ట్ ఉండనుంది. అదే సమయంలో యూజర్లకు మరిన్ని ఎంపికలు ఇవ్వాలనే ఉద్దేశంతో, థర్డ్ పార్టీ చాట్‌బాట్స్‌ను Siriలో ఉపయోగించే అవకాశం కూడా ఇవ్వనుంది.
వివరాలు
సిరి ఎక్స్టెన్షన్స్ ఫీచర్‌తో కొత్త అనుభవం
బ్లూమ్ బెర్గ్ నివేదిక ప్రకారం, ఆపిల్ 'సిరి ఎక్స్టెన్షన్స్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు Claude AI వంటి థర్డ్ పార్టీ చాట్‌బాట్స్‌ను నేరుగా Siriలో ఉపయోగించగలరు. ఇందుకోసం ప్రత్యేకంగా AI App Store సెక్షన్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
వివరాలు
AI యాప్ స్టోర్'తో కొత్త వ్యాపార మోడల్
Apple తన హార్డ్‌వేర్ బలాన్ని మరింతగా వినియోగించుకోవాలని చూస్తోంది. OpenAI, Google వంటి కంపెనీలతో AI పోటీలో ముందంజలో లేకపోయినా, తన ప్లాట్‌ఫామ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకునే వ్యూహాన్ని అవలంబిస్తోంది. App Storeలో ప్రత్యేక AI సెక్షన్ ద్వారా థర్డ్ పార్టీ AI సర్వీసులు Siriతో కనెక్ట్ అవుతాయి. దీంతో AI కంపెనీలకు ఎక్కువ యూజర్లకు చేరుకునే అవకాశం లభిస్తే, Appleకి కమిషన్ రూపంలో భారీ ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఈ నిర్ణయం Appleకు చెందిన కొంతమంది AI నిపుణులు ఇతర కంపెనీలకు వెళ్లిపోతున్న సమయంలో తీసుకోవడం గమనార్హం.
వివరాలు
Gemini ఆధారిత Siri ఎప్పుడు?
ఇటీవల ఆపిల్, గూగుల్ తో కలిసి Gemini ఆధారిత Siri కోసం ఒప్పందం కుదుర్చుకుంది. 'Campo' అనే కోడ్‌నేమ్‌తో వస్తున్న కొత్త Siri, 2026 జూన్ 8న జరిగే Apple Worldwide Developers Conference 2026లో ప్రకటించే అవకాశం ఉంది. అయితే, యూజర్లు ఈ ఫీచర్లను పూర్తిగా ఉపయోగించాలంటే iOS 27 విడుదల వరకు వేచి చూడాల్సి ఉంటుంది. iOS 27, 2026 చివర్లో విడుదలయ్యే iPhone 18 Pro సిరీస్‌తో పాటు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
వివరాలు
మరింత శక్తివంతమైన Siri
కొత్త Siri ద్వారా టాస్క్‌లను పూర్తి చేయడం, సమాచారం సులభంగా పొందడం వంటి ఫీచర్లు మెరుగుపడనున్నాయి. అదనంగా, ChatGPT లేదా Gemini తరహాలో పని చేసే స్టాండలోన్ Siri యాప్‌పై కూడా Apple పరీక్షలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.