Foldable iPhone: 2026 చివర్లో అపిల్ నుంచి మొట్టమొదటి ఫోల్డబుల్ ఐఫోన్
ఈ వార్తాకథనం ఏంటి
ఆపిల్ తమ ఐఫోన్ లైనప్‌లో భారీ మార్పులు చేయడానికి సిద్ధమవుతోంది. 2026 చివర్లో విడుదల కానున్న iPhone 18 Pro మోడల్స్‌తో పాటు కంపెనీ తొలిసారి ఒక ఫోల్డబుల్ ఐఫోన్‌ని కూడా మార్కెట్‌లోకి తీసుకురానుంది. ఆ తర్వాత 2027 ఆరంభంలో సాధారణ iPhone 18, తక్కువ ధరలో ఉండే iPhone 18e, అలాగే అప్‌డేట్ చేయబడిన iPhone Air వంటి మిడ్-టియర్ మోడల్స్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ విధంగా కంపెనీ ప్రతి సంవత్సరం ఐదు-ఆరు ఐఫోన్లను మార్కెట్‌లోకి తీసుకురావచ్చనే అంచనాలు కనిపిస్తున్నాయి. దీతో 2011 నుంచి కొనసాగుతున్న అపిల్ వార్షిక ఫాల్ లాంచ్‌ల సాంప్రదాయం మారే అవకాశం ఉంది.
వ్యూహాత్మక మార్పు
మూడు సంవత్సరాల మార్పు ప్రణాళికలో భాగంగా కొత్త ఐఫోన్లు
ఈ మార్పులు అన్నీ అపిల్ రూపొందించిన మూడు సంవత్సరాల ట్రాన్స్‌ఫార్మేషన్ ప్లాన్‌లో భాగమే. ఈ సంవత్సరం విడుదలైన iPhone Air, అలాగే కొత్తగా మార్పులు చేసిన iPhone 17 Pro మోడల్స్‌తో ఈ ప్లాన్ మొదలైంది. వచ్చే ఏడాదంతా ఈ మార్పులు కొనసాగి, 2026 చివర్లో ఫోల్డబుల్ ఐఫోన్‌తో ఈ దశ పూర్తి కావచ్చని సమాచారం. 2027లో అయితే అపిల్ మరింత ముందుకు వెళ్లి, కర్వ్డ్ గ్లాస్ డిస్ప్లే, అండర్-డిస్‌ప్లే కెమెరా వంటి సరికొత్త టెక్‌తో కూడిన ప్రీమియమ్ మోడల్‌ని కూడా చూపించొచ్చని ఊహాగానాలు ఉన్నాయి.
ఎగ్జిక్యూటివ్ షిఫ్ట్
అపిల్ నాయకత్వంలో కీలక మార్పులు
దీంతటితోపాటు, అపిల్‌లో సంవత్సరాలుగా ముఖ్యపాత్ర పోషించిన COO జెఫ్ విలియమ్స్ తన పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన బాధ్యతలను ఇతర సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు పంచిపెట్టడంతో కంపెనీలో పెద్ద ఎత్తున లీడర్‌షిప్ మార్పులు చోటుచేసుకున్నాయి. జోనీ ఐవ్ వెళ్లిన తర్వాత అపిల్‌లో కనిపించిన అత్యంత పెద్ద నాయకత్వ మార్పులుగా వీటిని పరిశ్రమ చూస్తోంది. లాంచ్‌లను విస్తరించడం, ఫోల్డబుల్ మార్కెట్‌లోకి అడుగుపెట్టడం, నాయకత్వ వ్యవస్థలో మార్పులు చేయడం—ఈ అన్నీ చూస్తుంటే అపిల్ పూర్తిగా కొత్త దిశలో అడుగులు వేస్తుందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.