Page Loader
Apple: మొదటి వెర్షన్‌ను విడుదల చేసిన ఆపిల్ ఇంటెలిజెన్స్ 
మొదటి వెర్షన్‌ను విడుదల చేసిన ఆపిల్ ఇంటెలిజెన్స్

Apple: మొదటి వెర్షన్‌ను విడుదల చేసిన ఆపిల్ ఇంటెలిజెన్స్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 30, 2024
11:16 am

ఈ వార్తాకథనం ఏంటి

iOS 18.1, iPadOS 18.1, macOS Sequoia 15.1 కోసం ఆపిల్ డెవలపర్ బీటాలను ఆవిష్కరించింది. ఇది 'యాపిల్ ఇంటెలిజెన్స్' అని పిలవబడే కృత్రిమ మేధస్సు (AI) ఫీచర్ల మొదటి సెట్‌ను పరిచయం చేసింది. నివేదిక ప్రకారం ఆపిల్ ఇంటెలిజెన్స్ EU, చైనాలో అందుబాటులో లేదు. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ ప్రారంభ సెట్‌లు పరిచయం చేసినప్పటికీ త్వరలోనే వాటిని విడుదల చేయనున్నాయి. బ్లూమ్‌బెర్గ్ నివేదించినట్లుగా రోల్‌అవుట్ 2025 వరకు కొనసాగవచ్చు.

Details

ఆపిల్ iOS 18 కోసం రెండవ పబ్లిక్ బీటా ప్రారంభం

ఈ అప్‌డేట్‌లు అందుబాటులోకి వచ్చినప్పుడు వాటిని యాక్సెస్ చేయడానికి వినియోగదారులకు ఆపిల్ 12 ప్రోమో లేదా ప్రో మాక్స్ లకు ఆపిల్ సిలికాన్ చిప్‌తో కూడిన పరికరం అవసరం. ఆపిల్ iOS 18 కోసం రెండవ పబ్లిక్ బీటాను ప్రారంభించింది. ఈ అప్‌డేట్‌లో ఇటీవలి డెవలపర్ బీటాలో కొత్త కార్‌ప్లే వాల్‌పేపర్‌లు, లైట్ మోడ్‌లో ఉన్నప్పుడు డార్క్ మోడ్ విడ్జెట్‌లను ఉపయోగించడం వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆపిల్‌లోని AI ఫీచర్లు మొదట డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ప్రకటించారు.

Details

 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు  ప్రకటన

జూన్‌లో జరిగిన యాపిల్ వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు మొదటిసారిగా ప్రకటించిన విషయం తెలిసిందే. తర్వాత జూలై 15న పబ్లిక్ iOS 18 బీటాలో విడుదల చేశారు. డెవలపర్‌లు కొత్త Apple ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను ఎంచుకొనే అవకాశం ఉంది. ఈ కొత్త ఫీచర్‌లు అందుబాటులోకి రాకముందే వాటిని డెవలపర్లు పరిశీలించనున్నారు.