LOADING...
Ask.com: Ask.com షట్‌డౌన్.. ఒక యుగానికి ముగింపు
Ask.com షట్‌డౌన్.. ఒక యుగానికి ముగింపు

Ask.com: Ask.com షట్‌డౌన్.. ఒక యుగానికి ముగింపు

వ్రాసిన వారు Sirish Praharaju
May 03, 2026
04:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు సెర్చ్ ఇంజిన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్ చేసిన Ask.com అధికారికంగా తన సేవలను నిలిపివేసింది. ముందుగా Ask Jeeves పేరుతో ప్రారంభమైన ఈ ప్లాట్‌ఫామ్ మూతపడుతున్నట్టు కంపెనీ హోమ్‌పేజ్‌లో ప్రకటించింది. "IAC తన వ్యాపార దిశను మార్చుకుంటున్న నేపథ్యంలో,Ask.com సెర్చ్ సేవలను నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం" అని పేర్కొంది. 1997లో గారెట్ గ్రూనర్,డేవిడ్ వార్తేన్ ఈ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. ఆ సమయంలో గూగుల్ ఇంత పెద్ద స్థాయిలో ఎదగలేదు. ఇతర సెర్చ్ ఇంజిన్‌లతో పోలిస్తే,Ask Jeeves ప్రత్యేకత ఏమిటంటే యూజర్లు పూర్తి ప్రశ్నలను టైప్ చేయగలగడం. దీనివల్ల అది మరింత సహజంగా, చాట్‌లా అనిపించేది. ఈ ప్లాట్‌ఫామ్‌కు గుర్తింపు తెచ్చింది దాని బట్లర్ మాస్కాట్ "Jeeves",ఇది పి.జి.వుడ్‌హౌస్ రచనలలోని పాత్ర ఆధారంగా రూపొందింది.

వివరాలు 

ఉద్యోగులు, వినియోగదారులకు కంపెనీ ధన్యవాదాలు

ఈ మాస్కాట్ మేసీస్ థాంక్స్ గివింగ్ డే పరేడ్ లో కూడా కనిపించి బ్రాండ్‌ను మరింత పాపులర్ చేసింది. కానీ, గూగుల్ ఆధిపత్యం పెరిగేకొద్దీ Ask Jeeves వెనుకబడింది. 2005లో IAC ఈ కంపెనీని కొనుగోలు చేసి "Jeeves" పేరును తీసేసి Ask.comగా రీబ్రాండ్ చేసింది. 2010 నాటికి సెర్చ్ సేవలను తగ్గించి ప్రశ్న-జవాబు ఫార్మాట్‌పై దృష్టి పెట్టింది. ప్రయత్నాలు చేసినప్పటికీ, Ask.com మళ్లీ పాత స్థాయికి చేరుకోలేకపోయింది. 2009లో NASCAR అధికారిక సెర్చ్ ఇంజిన్‌గా ఎంపికైనా, ఎక్కువ మందికి ఇది పాత ఇంటర్నెట్ జ్ఞాపకంగా మాత్రమే మిగిలింది. చివరగా, తమ ప్రయాణంలో భాగమైన ఉద్యోగులు, వినియోగదారులకు కంపెనీ ధన్యవాదాలు తెలుపుతూ వీడ్కోలు చెప్పింది.

Advertisement