Page Loader
whatsapp: సరికొత్త ఫీచర్‌ లతో త్వరలో వాట్సాప్ 
whatsapp: సరికొత్త ఫీచర్‌ లతో త్వరలో వాట్సాప్

whatsapp: సరికొత్త ఫీచర్‌ లతో త్వరలో వాట్సాప్ 

వ్రాసిన వారు Stalin
May 28, 2024
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

వాట్సాప్ లేనిదే ప్రపంచం నడవదన్న చందంగా ప్రస్తుత సమాజం తయారైంది. చిన్న పిల్లవాడి నుంచి పండు ముదుసలి వరకు వాట్సాప్ మన జీవనంలో ఓ భాగమై పోయింది. ఏదైనా సమాచారం పంపాలన్నా. వాట్సాప్ దిక్కు అయింది. ఫోటోలు పంచుకోవాలన్నాసులభతరంగా చేరే ఏకైక మార్గం వాట్సాప్. వ్యక్తిగత మెసేజింగ్ యాప్‌ను అలంకరించే గ్రీన్ థీమ్‌కు వాట్సాప్ వినియోగదారులు బాగా అలవాటు పడ్డారు. అయితే, వ్యక్తిగత మెసేజింగ్ యాప్, కనీసం కంపెనీ iOS అప్లికేషన్‌లో విభిన్న థీమ్‌ల జోడింపుతో WhatsApp అనుభవాన్ని రూపొందిస్తోంది. దీనిని తన వినియోగదారులకు అందించేందుకు కృషి చేస్తుంది.ఈ కొత్త పరిచయం త్వరలో అందుబాటులోకి రానుంది.

Details 

WABetaInfo ఇటీవలి ఇచ్చిన నివేదిక ఇలా ఉంది 

WhatsApp కొత్త డిఫాల్ట్ చాట్ థీమ్ ఫీచర్‌ను పరిచయం చేయాలని చూస్తోంది.అది AIసహకారంతో మీ ప్రొఫైల్ ను భవిష్యత్తులో ఆధునీకరించటానికి వీలు కల్పిస్తుంది. ఈఫీచర్ ను ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్నట్లు నివేదిక పేర్కొన్నది.టెస్ట్‌ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ దీనిని సమయంలో దీనిని గుర్తించారు. కొత్త వాట్సాప్ థీమ్ ఫీచర్ ఎలా పని చేస్తుంది? వినియోగదారులు తమ డిఫాల్ట్ చాట్ బబుల్ రంగును AIకు అనుగుణంగా మార్చడానికి వీలవుతుంది. ఈ కొత్త ఫీచర్‌ని జోడించే ప్రక్రియలో WhatsAppఇప్పటికే ఉందని ఆ నివేదిక పేర్కొంది. దీనితో సహా iOS 24.11.10.70వెర్షన్ కోసం WhatsAppబీటాలో వారి డిఫాల్ట్ థీమ్‌ను ఎంచుకునే అవకాశం కల్పించింది. ఇది వినియోగదారులకు మేలు చేకూర్చనుంది.తద్వారా మెటా ఇప్పటికే ఈ ఫీచర్‌ను మెరుగుపరిచే ప్రక్రియలో ఉంది.

Details 

చిత్రాల మార్ఫింగ్, ప్రొఫైల్ ఫోటోలను కాపీ చేయలేరు 

WhatsApp భవిష్యత్తు వెర్షన్ యాప్‌లో మరో 4 చాట్ థీమ్ ఆప్షన్‌లను జోడించే పనిలో వుంది. Meta ప్రస్తుతం అదే పనిలో ఉన్నట్లు సమాచారం. కొత్త చాట్ థీమ్‌ను ఎంచుకోవడం వల్ల వినియోగదారుల వాల్‌పేపర్,బబుల్ రంగు కొత్త థీమ్ ఒకే రంగుల పాలెట్‌కు సరిపోయేలా రూపొందించనున్నారు. చిత్రాల మార్ఫింగ్ వంటివి చేయకుండాMeta తగిన చర్యలు చేపట్టింది. తమ వ్యక్తిగత భద్రతకు ముప్పు రాకుండా వుండాలని కొందరు భావిస్తారు. తమ ఫోటోలు సోషల్ మీడియా,WhatsAppలో కనపడకుండా వుండేలా చూసే ఇష్టపడే ఒక భద్రతా ఫీచర్‌ ఉంటుంది. WhatsApp కు అదనంగా ఒక భద్రతా ఫీచర్‌ అవుతుంది. ఇది పరిచయాలను ప్రొఫైల్ ఫోటోల స్క్రీన్‌షాట్‌లను తీసుకోనివ్వదు. తద్వారా వినియోగదారుల గోప్యతను మరింత సురక్షితం చేయనుంది.