Page Loader
మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్  ఫీచర్‌లు!
2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు

మీకోసం 2022లో విడుదలైన ఉత్తమ వాట్సాప్ ఫీచర్‌లు!

వ్రాసిన వారు Nishkala Sathivada
Dec 24, 2022
12:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

2022లో, వాట్సాప్ లో కొత్త ఫీచర్లను విడుదల చేసింది పేరెంట్ సంస్థ మెటా. ఆ టాప్ ఫీచర్‌ల జాబితా ఇక్కడ ఉంది. ఒకే సమాచారాన్ని బహుళ సమూహాలలో చెప్పాల్సివచ్చినప్పుడు కమ్యూనిటీల ఫీచర్ ఆ పని సులభతరం చేస్తుంది. అడ్మిన్ రైట్స్ ఉంటే ఒక సమూహంను మరొకదానిలో విలీనం చేయచ్చు. కాల్ లింక్‌లతో ఆ కాల్‌ లో పాల్గొనడానికి మిగతావారిని ఆహ్వానించచ్చు. ఇప్పుడు 32 మంది ఒకేసారి వీడియో కాల్‌ మాట్లాడచ్చు. కాల్ ఆహ్వాన లింక్‌లు 30 రోజుల వరకు చెల్లుబాటులో ఉంటాయి. వాట్సాప్ లో 2GB వరకు ఫైల్స్ ను షేర్ చేయవచ్చు. ఫేస్బుక్, ఇంస్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్ లో కూడా ఎమోజీలతో సందేశాలకు ప్రతిస్పందించవచ్చు.

వాట్సాప్

వ్యాపారాల నుండి నేరుగా కొనుక్కోవచ్చు

5. మల్టీ టాస్కింగ్ చేస్తున్నట్లయితే, చాట్‌లో లేకుండానే వాట్సాప్‌లో వాయిస్ నోట్స్ ప్లే చేయచ్చు. 6. 'యాక్సిడెంటల్ డిలీట్' ఫీచర్ తొలగించిన సందేశాన్ని పునరుద్ధరిస్తుంది. 7. వాట్సాప్ 'view once' మెసేజింగ్ ఆప్షన్ కోసం స్క్రీన్‌షాట్‌లను నిలిపివేసింది. 8. గ్రూప్ చాట్ నుండి నిష్క్రమించినప్పుడు, అడ్మిన్‌లకు మాత్రమే తెలుస్తుంది. గ్రూప్ అడ్మిన్‌లకు గ్రూప్ చాట్‌లో అనవసరమైన సందేశాలను తొలగించే అధికారం ఉంది. 9. మెటా తన మొదటి ఎండ్-టు-ఎండ్ షాపింగ్ అనుభవాన్ని వాట్సాప్‌లో, జియోమార్ట్ భాగస్వామ్యంతో ఆగస్టులో భారతదేశంలో ప్రారంభించింది. జియో మార్ట్ కిరాణా కేటలాగ్‌ని బ్రౌజ్ చేసి ఐటెమ్స్ ఎంచుకుని తుది చెల్లింపు చేయవచ్చు. ఇది ప్రారంభించడానికి, వాట్సాప్ లో +917977079770కి "హాయ్" అని పంపాలి.