
భారీగా కరుగుతున్న హిమనీనదాలు.. దిగువన పొంచి ఉన్న పెను ముప్పు
ఈ వార్తాకథనం ఏంటి
రెండు వందల కోట్ల మందికిపైగా నీటిని అందిస్తున్న హిమాలయాలు భారీగా కరుగుతున్నాయి. రానున్న రోజుల్లో హిమాలయాలపై ఆధారపడిన దేశాలకు హిమనీనదాలతో తీవ్ర ప్రమాదం పొంచి ఉన్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే భారీగా వరదలు సైతం సంభవించే ప్రమాదమున్నట్లు అంచనా వేసింది.
వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగానే హిమాలయ గ్లేసియర్స్ చాలా వేగంగా కరిగిపోతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ మేరకు హిమాలయాల్లోని 200 సరస్సులు ప్రమాదకరంగా మారుతున్నాయని నివేదికలో పొందుపరిచారు.
గడిచిన దశాబ్ధం 2011 నుంచి 2020 వరకు పోల్చితే 65 శాతం హిమనీనదాలు వేగంగా కనుమరుగవుతుండటం పట్ల ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఇంటిగ్రేటెడ్ మౌంటైన్ డెవలప్‌మెంట్ (ఐసీఐఎంఓడీ) నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
DETAILS
హిమనీనదాల వల్లే కోట్లాది మంది జనానికి ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి, ఆదాయం : జాకబ్ స్టైనర్
వాతావరణంలో వేడి పెరుగుతున్న కొద్ధీ మన అనుకోని రీతిలో మంచు గడ్డలు కరుగుతున్నాయని ఆ సంస్థకు చెందిన పరిశోధకుడు జాకబ్ స్టైనర్ హెచ్చరించారు.
ఓ వైపు హిందూ కుష్ హిమాలయ ప్రాంతం, మరోవైపు పర్వత పరిసరాల్లోని దాదాపుగా 2 బిలియన్లకుపైగా ప్రజలకు, ఈ నీరే ఆధారమన్నారు.
గాల్లోకి విపరీతంగా రిలీజ్ అవుతున్న ఉద్గారాల ధాటికి ఈ శతాబ్ధం చివరి వరకు, వాటి ప్రస్తుత పరిమాణంలో 80 శాతం మేర కోల్పోవచ్చని హెచ్చరించారు.
గంగ, సింధు, ఎల్లో, మెకాంగ్, ఐరావడ్డీ నదులతో పాటు 10 ఇతర ముఖ్యమైన నదీ వ్యవస్థకు హిమానీనదాలే కీలకంగా ఉంటాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మంది జనానికి ఆహారం, నీరు, స్వచ్ఛమైన గాలి, ఆదాయాన్ని అందిస్తున్నాయన్నారు.