LOADING...
iPhone Users Alert: కొత్త ఫిషింగ్ స్కామ్‌పై కేంద్రం హెచ్చరిక.. ఐఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి
కొత్త ఫిషింగ్ స్కామ్‌పై కేంద్రం హెచ్చరిక.. ఐఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి

iPhone Users Alert: కొత్త ఫిషింగ్ స్కామ్‌పై కేంద్రం హెచ్చరిక.. ఐఫోన్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 24, 2026
11:01 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రానికి చెందిన నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ అనలిటిక్స్ యూనిట్ (NCTAU) తాజాగా ఆపిల్ ఐఫోన్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న కొత్త ఫిషింగ్ మోసంపై కీలక హెచ్చరిక జారీ చేసింది. ముఖ్యంగా పోయిన లేదా దొంగిలించబడిన ఐఫోన్ల యజమానులను టార్గెట్ చేస్తూ ఈ మోసాలు జరుగుతున్నట్లు గుర్తించింది. సైబర్ నేరగాళ్లు తమ చేతికి చిక్కిన దొంగిలించిన ఐఫోన్లను పూర్తిగా అన్‌లాక్ చేసేందుకు ఈ కొత్త మోసపూరిత పద్ధతిని ఉపయోగిస్తున్నట్లు నివేదికలో వెల్లడైంది. ఇందుకోసం వారు ఆపిల్ సపోర్ట్ పేరుతో నకిలీ ఎస్ఎంఎస్ లు పంపిస్తున్నారు.

వివరాలు

అత్యవసర హెచ్చరికలు జారీ

ఆ సందేశాల్లో "మీ ఐఫోన్ ఆఫ్ అయింది", "డేటా ఎరేజ్ చేయాలి", "డివైస్ ట్రాక్ చేయండి" వంటి అత్యవసర హెచ్చరికలు ఉంటున్నాయి. ఆ ఎస్ఎంఎస్‌లో ఉన్న లింక్‌పై క్లిక్ చేసిన వెంటనే వినియోగదారులు అసలు యాపిల్ లేదా ఐక్లౌడ్ లాగిన్ పేజీలా కనిపించే నకిలీ వెబ్‌సైట్‌కు వెళ్లిపోతున్నారు. అక్కడ ఆపిల్ ఐడి, పాస్‌వర్డ్‌తో పాటు ఓటీపీ వివరాలను కూడా నమోదు చేయమని అడుగుతున్నారు. బాధితులు ఆ వివరాలు నమోదు చేసిన క్షణంలోనే సైబర్ నేరగాళ్లు వారి ఐక్లౌడ్ ఖాతాపై పూర్తి నియంత్రణ సాధిస్తున్నారు.

వివరాలు

ఫైండ్ మై ఐఫోన్ ఫీచర్ తో డిసేబుల్

ఇంతటితో ఆగకుండా, దొంగిలించిన ఐఫోన్‌లో నుంచి అసలు యజమాని ఆపిల్ ఐడిని తొలగించి, "Find My iPhone" ఫీచర్‌ను కూడా డిసేబుల్ చేస్తున్నారు. దీంతో ఆ ఫోన్‌ను మళ్లీ విక్రయించడం లేదా వినియోగించడం వారికి సులభమవుతోంది. సైబర్ నిపుణుల ప్రకారం, ఈ మోసం చాలా ప్రణాళికాబద్ధంగా జరుగుతోంది. ముఖ్యంగా ఫోన్ పోయిందనే ఆందోళనలో ఉన్న వినియోగదారుల భావోద్వేగాలను ఆసరాగా తీసుకుని నేరగాళ్లు మోసం చేస్తున్నారని హెచ్చరిస్తున్నారు.

Advertisement

వివరాలు

సురక్షితంగా ఉండేందుకు సూచనలు

SMS ద్వారా వచ్చే అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదు. OTPలను ఎవరితోనూ పంచుకోవద్దు. అధికారిక Apple "Find Devices" సేవనే ఉపయోగించాలి. "Find My iPhone" ఫీచర్‌ను ఎప్పుడూ యాక్టివ్‌లో ఉంచాలి. Two-Factor Authentication (2FA) తప్పనిసరిగా ఆన్ చేయాలి. ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్‌లో బ్లాక్ చేయించాలి. ఫిషింగ్ ప్రయత్నాలపై వెంటనే National Cyber Crime Reporting Portalలో ఫిర్యాదు చేయాలి లేదా 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేయాలి. అలాగే యాపిల్ అధికారిక డివైస్ ట్రాకింగ్ సేవ కోసం Apple Find Devices సేవనే ఉపయోగించాలని అధికారులు వినియోగదారులకు సూచిస్తున్నారు.

Advertisement