Page Loader
చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3: కక్ష్య కుదింపు చర్యలో విజయం 
కక్ష్య కుదింపు చర్యను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో

చంద్రుడికి మరింత దగ్గరలో చంద్రయాన్-3: కక్ష్య కుదింపు చర్యలో విజయం 

వ్రాసిన వారు Sriram Pranateja
Aug 09, 2023
02:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్-3 మిషన్, ప్రస్తుతం చంద్రుడి కక్ష్యలో తిరుగుతోంది. ఈరోజు మరోసారి కక్ష్య కుదింపు చర్యను చేపట్టారు. ఈ కారణంగా చంద్రుడికి మరింత దగ్గరగా చంద్రయాన్-3 చేరుకుంది. కక్ష్య కుదింపు చర్య విజయవంతంగా పూర్తయ్యిందని ఇస్రో వెల్లడి చేసింది. ఇప్పటివరకు రెండు సార్లు కక్ష్య కుదింపు చర్యలు జరిగాయి. మరో రెండుసార్లు ఆగస్టు 14, 17 తేదీలలో కక్ష్య కుదింపు చర్య ఉండనుందని ఇస్రో తెలియజేసింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై చంద్రయాన్-3 మిషన్ ల్యాండ్ కానుంది. చంద్రయాన్-3 మిషన్ ప్రయాణం, జులై 14న శ్రీహరి కోట నుండి మొదలైంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కక్ష్య కుదింపు చర్యపై ఇస్రో ట్వీట్