చంద్రయాన్ 3: ఈరోజు మద్యాహ్నం నింగిలోకి దూసుకెళ్ళనున్న రాకెట్
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రయాన్-3 మిషన్ ను ఈరోజు మద్యాహ్నం 2:35గంటలకు సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట నుండి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) లాంచ్ చేయనుంది.
ఈ మేరకు కౌంట్ డౌన్ మొదలైపోయింది. (LVM3) M4 వాహక నౌక సాయంతో చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్ళనుంది. ఈ మిషన్ ప్రయోగానికి మొత్తం ఖర్చు 615కోట్లు అయ్యింది.
2019లో చంద్రయాన్-2 ప్రయోగం విఫలం కావడంతో దానికి కొనసాగింపుగా చంద్రయాన్-3 మిషన్ ను లాంచ్ చేస్తున్నారు. ఈరోజు లాంచ్ అయిన మిషన్, ఆగస్టు 23 లేదా 24తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ కానుంది.
ఈ మిషన్ సక్సెస్ అయితే చంద్రుడిపై సేఫ్ ల్యాండర్ ని దింపిన నాలుగవ దేశంగా అమెరికా, రష్యా, చైనాల సరసన భారతదేశం నిలుస్తుంది.
Details
ఈ ప్రయోగంలో ఉండే మూడ్ మాడ్యూల్స్ వివరాలు
ప్రొపుల్సన్ మాడ్యూల్:
రాకెట్ ను ఆకాశంలోకి తీసుకెళ్ళి భూకక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో ఇది సాయపడుతుంది. భూకక్ష్యలోకి చేరుకోగానే ఈ మాడ్యూల్ విడిపోతుంది.
ల్యాండర్ మాడ్యూల్:
చంద్రుడి మీదకు రోవర్ ని మోసుకెళ్ళే ఈ మాడ్యూల్, చంద్రుడి ఉపరితలం నుండి 100కిలోమీటర్ల ఎత్తులో చంద్రుడి కక్ష్యను చేరుకుని, చంద్రుడి దక్షిణ ధృవం వద్ద రోవర్ ను దించుతుంది.
రోవర్:
ఇది చంద్రుడి ఉపరితలంపై ఉండే వస్తువులను పరిశీలిస్తుంది. మట్టి, మంచు మొదలగు వాటిని పరిశోధించి ఫలితాలను పంపిస్తుంది.
దక్షిణ ధృవంలో చీకటి ఎక్కువగా ఉన్నందువల్ల ఆ ప్రాంతాన్ని అన్వేషిస్తే సౌరకుటుంబం తొలిరోజుల గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.