
చంద్రయాన్-3: చంద్రుడి దారిలో మరింత దగ్గరగా స్పేస్ క్రాఫ్ట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటివరకు చంద్రయాన్-3 అంతరిక్ష నౌక హెల్త్ సాధారణంగానే ఉందని ఇస్రో తెలిపింది.
చంద్రయాన్-3 ప్రయోగంలో మరో మైలురాయిని చేరుకోనున్నట్లు వెల్లడి చేసిన ఇస్రో, రేపు సాయంత్రం 7గంటల ప్రాంతంలో చంద్రుడి కక్ష్యలోకి చంద్రయాన్-3 చేరుకోనున్నట్లు తెలియజేసింది.
ఇప్పటివరకు చంద్రుడి వైపు ప్రయాణంలో మూడింట రెండు వంతులు పూర్తి చేసిందని ఇస్రో తెలిపింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఆగస్టు 23వ తేదీన చంద్రుడిపై చంద్రయాన్-3 ల్యాండ్ కానుంది.
అత్యంత చీకటిగా ఉండే చంద్రుడి దక్షిణ ధృవం మీద చంద్రయాన్-3 ల్యాండ్ కానుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
చంద్రయాన్-3 ప్రయాణంపై ఇస్రో ట్వీట్
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 1, 2023
The spacecraft’s health is normal.
Today’s perigee burn has successfully raised Chandrayaan-3 orbit to 288 km x 369328 km.
In this orbit, the spacecraft enters the moon’s sphere of influence.
A crucial maneuvre at perilune would achieve the Lunar…