
చంద్రయాన్-3: సురక్షితమైన ప్రదేశం కోసం వెతుకున్న ల్యాండర్; ఫోటోలు రిలీజ్ చేసిన ఇస్రో
ఈ వార్తాకథనం ఏంటి
చంద్రుడి దక్షిణ ధృవం మీద అడుగు పెట్టేందుకు విక్రమ్ ల్యాండర్ అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. చంద్రుడికి అత్యంత దగ్గరలో ఉన్న ల్యాండర్ జాబిల్లి మీద మరో రెండు రోజుల్లో దిగబోతుంది.
ఈ నేపథ్యంలో జాబిల్లి మీద సురక్షితంగా దిగడానికి అనువైన ప్రదేశాన్ని ల్యాండర్ వెదుకుతోంది.
ల్యాండర్ కి ఉన్న LHDAC(Lander Hazard Detection and Avoidance Camera) కెమెరా ద్వారా ఏ ప్రదేశంలో దిగితే బాగుంటుందో చూస్తుంది.
పెద్ద పెద్ద బండరాళ్ళు, సొరంగాలు లేని ప్రదేశంలో దిగడానికి ఈ కెమెరా ఉపయోగపడుతుంది. ఈ అధునాతమైన కెమెరాను ఇస్రో అభివృద్ధి చేసింది.ప్రస్తుతం చంద్రుడి మీద ల్యాండర్ దింపిన ఫోటోలను సోషల్ మీడియాలో ఇస్రో పంచుకుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఇస్రో ట్వీట్
Chandrayaan-3 Mission:
— ISRO (@isro) August 21, 2023
Here are the images of
Lunar far side area
captured by the
Lander Hazard Detection and Avoidance Camera (LHDAC).
This camera that assists in locating a safe landing area -- without boulders or deep trenches -- during the descent is developed by ISRO… pic.twitter.com/rwWhrNFhHB