LOADING...
Chiron: తిరోగమన కదలికలో ఉన్న చిరోన్.. అదేంటంటే..?
తిరోగమన కదలికలో ఉన్న చిరోన్.. అదేంటంటే..?

Chiron: తిరోగమన కదలికలో ఉన్న చిరోన్.. అదేంటంటే..?

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
01:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

జూపిటర్,శని గ్రహాల కంటే దూరంగా ఉన్న ఆకాశపు ఖగోళ శరీరం "చిరోన్" ప్రస్తుతం వక్ర గతి (Retrograde Motion) లో కొనసాగుతూ 2026 జనవరి 2 వరకు ఈ స్థితిలోనే ఉంటుంది. 1977లో ఖగోళ శాస్త్రవేత్త చార్ల్స్ కోవల్ దీనిని గుర్తించారు. మొదట గ్రహశకలంగా( asteroid) వర్గీకరించినా, కొన్ని సందర్భాల్లో తోక లేదా 'కోమా' ఏర్పడటం వల్ల తరువాత దీన్ని ధూమకేతువుగా గుర్తించారు. 2023లో ఖగోళ శాస్త్రవేత్తలు చిరోన్‌కు రింగ్స్(rings) ఉన్నాయని నిర్ధారించారు. ఈ విధంగా మన సౌర వ్యవస్థలో రింగ్స్ కలిగిన నాలుగో గ్రహేతర ఖగోళ శరీరంగా ఇది నిలిచింది.

కక్ష్య వివరాలు 

సూర్యుడి నుండి చిరోన్ కక్ష్య దూరం 

చిరోన్‌కు అధికారికంగా (2060) చిరోన్‌ అనే పేరు ఉంది.ఇది సూర్యుని చుట్టూ ఒక దీర్ఘవలయాకార కక్ష్యలో తిరుగుతుంది. సూర్యునికి అతి దగ్గరగా ఇది సుమారు 1.3 బిలియన్ కి.మీ దూరంలోకి వస్తుంది,అంటే భూమి-సూర్యుల మధ్య దూరం కంటే సుమారు ఎనిమిది రెట్లు ఎక్కువ. అతి దూరంగా వెళ్లే సమయంలో ఇది 2.7 బిలియన్ కి.మీ దూరం చేరుతుంది, అంటే దాదాపు 19 రెట్లు ఎక్కువ దూరం. ఈ కక్ష్య జూపిటర్, యూరేనస్ మధ్యలో ఉండి, కొన్నిసార్లు శనిగ్రహం కక్ష్యను కూడా దాటుతుంది.

'సెంటార్' వర్గం 

'చిరోన్' అనే పేరు దేనిని సూచిస్తుంది? 

చిరోన్ 'సెంటార్స్' అనే వర్గానికి చెందినది. ఇవి భారీ గ్రహాల గురుత్వాకర్షణ ప్రభావం వల్ల స్థిరంగా ఉండని కక్ష్యలతో తిరిగే చిన్న ఖగోళ శరీరాలు. గ్రీకు పురాణాలలో 'సెంటార్స్' అంటే అర్ధమానవుడు-అర్ధగుఱ్ఱం ఆకారంలో ఉండే జీవులు. వాటిలో చైరాన్ వయస్సులో పెద్దది, జ్ఞానవంతుడు అని చెప్పబడుతుంది. ఈ పురాణ సంబంధం చైరాన్‌కు మరింత ఆసక్తికరమైన మర్మాన్ని అందిస్తుంది.

రెట్రోగ్రేడ్  వివరణ 

ఖగోళ శాస్త్రంలో వక్ర గతి అంటే ఏమిటి? ? 

ఖగోళ శాస్త్రంలో వక్ర గతి అనేది భూమి నుంచి చూస్తే ఒక గ్రహం లేదా ఖగోళ శరీరం ఆకాశంలో వెనక్కి కదులుతున్నట్లు కనిపించే భ్రమ. సాధారణంగా అన్ని గ్రహాలు, చిరోన్ సూర్యుని చుట్టూ ఒకే దిశలో తిరుగుతూ పశ్చిమం నుంచి తూర్పు వైపు కదులుతున్నట్లు కనిపిస్తాయి. అయితే భూమి ఒక గ్రహాన్ని దాటిపోయినప్పుడు లేదా ఆ గ్రహం భూమిని దాటినప్పుడు, అవి తాత్కాలికంగా తూర్పు నుంచి పశ్చిమం వైపు కదులుతున్నట్లు కనిపిస్తాయి. దీన్నే 'అపారెంట్ రిట్రోగ్రేడ్ మోషన్' అంటారు.