Claude: ఇక ఈ-మెయిల్స్ కూడా పంపనున్న క్లాడ్.. కొత్త ఫీచర్‌తో మరింత పవర్‌ఫుల్
ఈ వార్తాకథనం ఏంటి
ఆంత్రోపిక్‌కు చెందిన ఏఐ ఏజెంట్ 'క్లాడ్'కు భారీ అప్‌డేట్ వచ్చింది. ఇందులో భాగంగా జీమెయిల్, గూగుల్ డ్రైవ్ ఇంటిగ్రేషన్లలో కీలక మార్పులు చేశారు. తాజా అప్‌డేట్‌తో క్లాడ్ ఇకపై యూజర్ల తరఫున ఈ-మెయిల్స్‌ను డ్రాఫ్ట్ చేయడం, రిప్లై ఇవ్వడం, ఫార్వర్డ్ చేయడం వంటి పనులు చేయగలదు. అయితే ఆటోమేటిక్‌గా రిప్లై పంపించే ముందు మాత్రం యూజర్ అనుమతి తప్పనిసరిగా తీసుకుంటుంది. క్లాడ్‌లో ఇప్పటికే ఉన్న గూగుల్ డ్రైవ్, జీమెయిల్, గూగుల్ క్యాలెండర్ కనెక్టర్ల సామర్థ్యాలను ఈ అప్‌డేట్ మరింత విస్తరించింది. తాజా మార్పులతో క్లాడ్ మరిన్ని పనులను స్వయంగా నిర్వహించగలదు.
వివరాలు
ఇక ఈ-మెయిల్స్ పంపొచ్చు.. ఫైల్స్ కూడా మేనేజ్ చేయొచ్చు
అప్‌డేట్ చేసిన గూగుల్ వర్క్‌స్పేస్ కనెక్టర్లను ఉపయోగించి క్లాడ్ ఇప్పుడు జీమెయిల్‌లో ఈ-మెయిల్స్ పంపడంతో పాటు గూగుల్ డ్రైవ్‌లోని ఫైల్స్‌ను కూడా మేనేజ్ చేయగలదని ఆంత్రోపిక్ 'ఎక్స్'లో ప్రకటించింది.
ఇప్పటివరకు క్లాడ్ ప్రధానంగా ఈ-మెయిల్స్‌ను చెక్ చేయడం, ముఖ్యమైన లేదా పొడవైన మెసేజ్‌లను యూజర్ల కోసం సారాంశంగా అందించడం వంటి పనులకే పరిమితమైంది.
తాజా అప్‌డేట్‌తో ఈ సామర్థ్యాలు మరింత పెరిగాయి.
వివరాలు
ఈ-మెయిల్ పంపే ముందు యూజర్ అనుమతి తప్పనిసరి
గూగుల్ డ్రైవ్‌లో ఫైల్ మేనేజ్‌మెంట్ సామర్థ్యాలను కూడా క్లాడ్‌కు జోడించారు.
యూజర్ ఇచ్చే సూచనల ఆధారంగా క్లౌడ్ స్టోరేజ్‌లోని ఫైల్స్‌ను షేర్ చేయడం, ఒక చోటు నుంచి మరో చోటుకు తరలించడం, డిలీట్ చేయడం వంటి పనులను కూడా క్లాడ్ చేయగలదు.
అయితే ఈ కొత్త సామర్థ్యాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ.. ఈ-మెయిల్ పంపే ముందు క్లాడ్ యూజర్ అనుమతిని తప్పనిసరిగా తీసుకుంటుంది.
దీంతో ఆటోమేటిక్‌గా రూపొందించిన రిప్లైని యూజర్ ముందుగా పరిశీలించి, అది సరైనదేనని నిర్ధారించుకున్న తర్వాతే పంపించవచ్చు.