Page Loader
Job seeker: చాట్‌జీపీటీ సహాయంతో ఉద్యోగ దరఖాస్తు.. సీవీని చూసి షాకైన కంపెనీ సీఈఓ 
చాట్‌జీపీటీ సహాయంతో ఉద్యోగ దరఖాస్తు.. సీవీని చూసి షాకైన కంపెనీ సీఈఓ

Job seeker: చాట్‌జీపీటీ సహాయంతో ఉద్యోగ దరఖాస్తు.. సీవీని చూసి షాకైన కంపెనీ సీఈఓ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 16, 2024
12:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉద్యోగాన్ని పొందడం కోసం అభ్యర్థులు ఎంతగా శ్రమిస్తారో అందరికీ తెలుసు. జాబ్‌ ఓపెనింగ్స్‌ ఉన్నాయంటే చాలు, ఆకర్షణీయమైన సీవీలు తయారుచేసేందుకు సిద్ధంగా ఉంటారు. గతంలో, సీవీ రూపొందించడానికి చాలా సమయం, శ్రమ వృథా చేసేవారు. ఒకదానిని పదిసార్లు పరిశీలించి, తప్పులు సరిదిద్దాల్సి వచ్చేది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. చాట్‌జీపీటీ (ChatGPT) సాంకేతికత అందుబాటులోకి వచ్చిన తర్వాత, చాలా మంది దీని సహాయంతో సులభంగా సీవీలను రూపొందిస్తున్నారు.

వివరాలు 

నైపుణ్యాలు, అనుభవం వంటి విషయాలపై ఆశ్చర్యం 

ఆలా,ఒక అభ్యర్థి చాట్‌జీపీటీ సాయంతో తన సీవీని ఆసక్తికరంగా రూపొందించి కంపెనీకి పంపించాడు. ఈ దరఖాస్తును చూసిన ఎంట్రేజ్‌ సంస్థ సీఈఓ అనన్య నారంగ్‌కు కంగుతిన్నారు. ఆమెకు ఇటీవల వచ్చిన ఉద్యోగ దరఖాస్తును చూస్తే ఆమె షాక్‌ తిన్నారు. సాధారణంగా, "చాట్‌జీపీటీకి ఫలానా ఉద్యోగం కోసం దరఖాస్తు రూపొందించు" అని చెబితే, ఆ ఏఐ ప్లాట్‌ఫామ్‌ సంబంధిత టెంప్లేట్‌ను చిటికెలో తయారుచేస్తుంది. అయితే, అభ్యర్థి చాట్‌జీపీటీ రూపొందించిన అప్లికేషన్‌ను కంపెనీకి పంపించాడని ఆమె గమనించారు. అందులో నైపుణ్యాలు, అనుభవం వంటి విషయాలను చూసి ఆమె ఆశ్చర్యపోయారు. దరఖాస్తు కోసం అభ్యర్థి చాట్‌జీపీటీని ఉపయోగించాడనే విషయం స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ విషయానికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను ఆమె 'ఎక్స్‌' వేదికపై పోస్ట్ చేశారు.

వివరాలు 

అనన్య నారంగ్‌ పోస్ట్‌ నెట్టింట వైరల్‌

"నిరుద్యోగం ఉందని చెప్పడంలో ఆశ్చర్యం లేదు" అంటూ ఆమె తన వ్యాఖ్యలు జోడించారు. "ఇలాంటి ఉద్యోగ దరఖాస్తులపై ఎలా స్పందించాలి?" అని ఎక్స్‌ వేదికలో సలహాలు అడిగారు. అనన్య నారంగ్‌ మాట్లాడుతూ, ''చాలామంది అభ్యర్థుల మాదిరిగా ఈ వ్యక్తి కూడా చాట్‌జీపీటీ సాయంతో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. అయితే, పంపేముందు మరోసారి దాన్ని చదవలేదు'' అని ఆమె అసహనం వ్యక్తం చేశారు. అంతే కాకుండా, ఆమె పెట్టిన పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. చాట్‌జీపీటీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇలాంటి దరఖాస్తులు సాధారణమైపోయాయని కొందరు రిక్రూటర్లు వెల్లడించారు.