Dubai: ఒక్కటి కాదు.. 53 ఐఫోన్లు! దుబాయ్ వ్యక్తి కలెక్షన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఈ వార్తాకథనం ఏంటి
ఐఫోన్ అంటే చాలామందికి ఓ స్మార్ట్‌ఫోన్ మాత్రమే. కానీ దుబాయ్‌కు చెందిన మహమ్మద్ షకాకు మాత్రం అది దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న అభిరుచి. తన దగ్గరున్న 53 పాత ఐఫోన్లను తీసుకుని ఆపిల్ స్టోర్‌కు వెళ్లిన ఆయన, కొత్తగా విడుదలైన రెండు iPhone Duo ఫోల్డబుల్ ఫోన్లను అందుకోవడంతో అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి తరం ఐఫోన్ నుంచి తాజా iPhone 18 Pro Max వరకు ఆయన సేకరణలో ఫోన్లు ఉండటం విశేషం.
Details
తొలి ఐఫోన్ నుంచి తాజా మోడల్ వరకు..
పాకిస్థాన్‌లోని కరాచీకి చెందిన షకా ప్రస్తుతం దుబాయ్‌లో నివసిస్తున్నారు.
దాదాపు 20 ఏళ్లుగా ఐఫోన్లను సేకరిస్తున్న ఆయనకు ఇది కేవలం హాబీ మాత్రమే కాదు.. తనకు తానే పెట్టుకున్న ఓ సవాలు కూడా.
కొన్ని మోడళ్లను వేర్వేరు రంగుల్లో ఒకటి కంటే ఎక్కువ కొనుగోలు చేశారు. వాటన్నింటినీ తన ఇంట్లో ప్రత్యేకంగా ప్రదర్శనకు ఉంచారు.
ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం, ఆపిల్ స్టోర్ సిబ్బంది ఆయనను ముందురోజే సంప్రదించి, తన ఐఫోన్ కలెక్షన్‌ను తీసుకురావాలని కోరారు.
దీంతో 53 ఫోన్లతో స్టోర్‌కు వచ్చిన షకా కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Details
మూడేళ్ల నిరీక్షణకు తెర
ఆపిల్‌పై తనకున్న అభిమానానికి కారణం ప్రతి కొత్త మోడల్‌లో వచ్చే మార్పులేనని షకా చెబుతున్నారు.
కెమెరా, టచ్ స్పందన, బ్యాటరీ, ఆపరేటింగ్ సిస్టమ్ వంటి అంశాల్లో ప్రతి తరంలోనూ మెరుగుదలలను గమనించానని వివరించారు.
శామ్‌సంగ్, మోటరోలా ఫోన్లు కూడా తన దగ్గర ఉన్నప్పటికీ, ఆపిల్ తనకు ఇష్టమైన బ్రాండ్ అని తెలిపారు.
ఆపిల్ ఫోల్డబుల్ ఫోన్ కోసం మూడేళ్లకు పైగా ఎదురుచూసిన ఆయనకు, iPhone Duo బుకింగ్స్ ప్రారంభం కావడంతో ఆ కోరిక నెరవేరింది.
వరుసగా మూడేళ్లపాటు కొత్త ఆపిల్ ఉత్పత్తుల విడుదల సమయంలో తొలి కస్టమర్లలో ఒకరిగా నిలిచిన షకా, తదుపరి లాంచ్ ఈవెంట్ కోసం కాలిఫోర్నియా వెళ్లి అక్కడ మొదటి కస్టమర్‌గా నిలవాలని ఆశిస్తున్నారు.