
Earth: భూభ్రమణ వేగం వల్ల 'నేడు 24 గంటల్లో' స్వల్ప తగ్గుదల
ఈ వార్తాకథనం ఏంటి
ఈ ఏడాది వేసవిలో భూమి చాలా వేగంగా తిరిగింది. ఫలితంగా రోజు వేగంగా గడిచిపోతోంది.! కానీ శాస్త్రవేత్తల ప్రకారం, భూమి ఈ ఏడాది ఆగస్టు 5న అంటే ఈ రోజు సాధారణంగా ఉండే 24 గంటల కాలాన్ని కంటే 1.25 మిల్లీ సెకన్లు తక్కువ సమయంతో తిరుగుతుందని తెలిపారు. అంటే ఆ రోజు సాధారణంగా ఉన్న రోజు కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇలా జరిగే రోజులలో ఆగస్టు 5, 2025లోనే కాకుండా, 1973 నుండి మొదలైన టైంకీపింగ్ రికార్డుల ప్రకారం కూడా అతి తక్కువ సమయంతో సాగిన రోజులలో ఒకటిగా నిలుస్తుంది.
వివరాలు
భూమి ఎందుకు మళ్లీ వేగంగా తిరుగుతోంది?
Timeanddate.com ప్రకారం,భూమి తిరుగుడు స్పీడ్ సాధారణం కంటే వేగంగా ఉందని గుర్తించారు. ఒక సగటు సౌర దినం అంటే 86,400 సెకన్లు ఉండాలి.కానీ కొన్ని రోజులలో ఇది కొంచెం తక్కువగా ఉంటోంది. ఈ ఏడాది (2025)లో ఇప్పటివరకు జూలై 9,జూలై 22, ఆగస్టు 5 తేదీలు భూమి వేగంగా తిరిగిన రోజులుగా గుర్తించారు. ఈ మూడు రోజులు సుమారుగా 1.2 నుంచి 1.3 మిల్లీ సెకన్ల మేర తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పటివరకు నమోదైన అతి తక్కువ సౌర దినం 2024 జూలై 5న నమోదైందీ,అప్పుడు భూమి 1.66 మిల్లీ సెకన్ల తేడాతో రోజుల్లో లోటు పడతాయట. ఇంతకాలంగా నెమ్మదిగా తిరుగుతూ వచ్చిన భూమి ఒక్కసారిగా మళ్లీ వేగంగా కదలడాన్నిశాస్త్రవేత్తలు గమనిస్తున్నారు.
వివరాలు
చంద్రుని ప్రభావం ఉందా?
ఎందుకు ఈ మార్పు వచ్చిందన్న దానికి ఇప్పటికీ స్పష్టత లేదు. భూమి తిరుగుదలపై చంద్రుని ప్రభావం ఉంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ కొంచెం కొంచెం దూరంగా వెళ్తున్నప్పుడు,అది భూమిపై టైడల్ ఫోర్స్ (ఆకర్షణ శక్తి) చూపిస్తుంది. దీని వల్ల భూమి తిరుగుదలపై చంద్రుని ప్రభావం వల్ల కాలక్రమేణా భూమి నెమ్మదిగా తిరుగుతుంది. ఇందుకు ముఖ్యమైన కారణం: అలాగే, చంద్రుని స్థానంలో వచ్చే తాత్కాలిక మార్పులు కూడా భూమి తిరుగుదలపై తాత్కాలిక ప్రభావం చూపుతాయి. చంద్రుని డిక్లినేషన్ (భూమి సమతల రేఖ పట్ల చంద్రుని కోణం) కూడా సముద్రాలపై ప్రభావం చూపి, తిరుగుదల వేగంలో తేడా తీసుకురావొచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇవే జూలై, ఆగస్టు నెలల్లో రోజుల తగ్గుదలకుకారణం అవ్వచ్చు.
వివరాలు
దీని వెనక దీర్ఘకాలిక కారణాలు ఏవైనా ఉన్నాయా?
చంద్రుడు తాత్కాలిక మార్పులకు కారణమైనా, భూమి తిరుగుదల స్పీడ్ పెరగడానికి మరింత లోతైన కారణాలు ఉండొచ్చని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా భూమి లోపల ఉన్న లిక్విడ్ కోర్ (ద్రవక కేంద్ర భాగం) గతి మారడం వల్ల బాహ్య పొరలు వేగంగా తిరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇంకొంతమంది శాస్త్రవేత్తలు వాతావరణ మార్పులు కూడా ప్రభావం చూపవచ్చని చెబుతున్నారు. కానీ గ్లోబల్ వార్మింగ్‌కి దీనితో ప్రత్యక్ష సంబంధం ఉందన్నట్టు ఇంకా నిర్ధారణ కాలేదు.
వివరాలు
సమయ పరంగా ఏమి జరుగుతుంది?
ఇది మన రోజువారీ జీవితం మీద ఎలాంటి ప్రభావం చూపకపోయినా, టైంకీపింగ్‌లో మాత్రం ఇది పెద్ద విషయం. ఈ వేగం కొనసాగితే, 2029 నాటికి ఓ నెగటివ్ లీప్ సెకండ్ (ఒక సెకన్ తగ్గించడం) జోడించాల్సి రావొచ్చు. ఇప్పటివరకు అలాంటి విషయం ఎప్పుడూ జరగలేదు.