Page Loader
Twitter Logo Change: ట్విట్టర్ లోగోకు రీబ్రాండ్; పక్షి స్థానంలో 'X' చేర్చిన మస్క్ 
ట్విట్టర్ లోగోకు రీబ్రాండ్; పక్షి స్థానంలో 'X' చేర్చిన మస్క్

Twitter Logo Change: ట్విట్టర్ లోగోకు రీబ్రాండ్; పక్షి స్థానంలో 'X' చేర్చిన మస్క్ 

వ్రాసిన వారు Stalin
Jul 24, 2023
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎలాన్ మస్క్ ట్విట్టర్‌లోగోను మార్చేశారు. పక్షి స్థానంలో 'X' అక్షరాన్ని చేసి లోగోను విడుదల చేశారు. ట్విట్టర్ కొత్త లోగో సోమవారం నుంచి కనపడుతోంది. దీంతో 2006 నుంచి బ్లూ రంగులో మధ్యలో కనిపించే పక్షి బొమ్మ ఇక కనుమరుగైంది. లోగోను పూర్తిస్థాయిలో మార్చి, ట్విట్టర్‌కు ఎలాన్ మస్క్ రీబ్రాండ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. ట్విట్టర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి దీన్ని 'X' బ్రాండ్‌తో ప్రమోట్ చేయాలని అనుకున్నారు. అందులో భాగంగానే తొలుత లోగోలోని బ్లూ రంగును మార్చేశారు. ఇప్పడు తాజాగా పక్షి బొమ్మను తొలగించారు. ట్విట్టర్‌ని రీబ్రాండింగ్ చేయడం గురించి మస్క్ ఆదివారమే ప్రకటించారు. పక్షి లోగోకు వీడ్కోలు పలుకుతున్నట్లు స్పష్టం చేశారు.

ట్వీట్

'ఎక్స్' యాప్‌గా ట్విట్టర్ రూపాంతరం

ట్విట్టర్ బ్రాండ్‌ను సమూలంగా మార్చే యోచనలో భాగంగా పేరును యాప్ పేరును 'ఎక్స్'గా మార్చబోతున్నారు. ప్రస్తుతం Twitter.com గా ఉన్న డొమైన్ X.com గా మారబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే భవిష్యత్‌లో ట్విట్టర్ అనే పేరు వినపడదు. మొత్తం 'X' పేరుతో దీనికి సంబంధించిన కార్యకరలాపాలు జరగనున్నాయి. చైనాకు చెందిన వియ్ చాట్ తరహాలోనే ఎలాన్ మస్క్ 'ఎక్స్' యాప్‌ను తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు. అందులో భాగంగానే మొత్తం ట్విట్టర్‌లో సమూల మార్పులు చేస్తున్నారు. భవిష్యత్‌లోనూ భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ట్విట్టర్ లోగోను పరిచయం చేసిన ఎలాన్ మస్క్