Loading...
Ariane 6: యూరప్ కీలక నిర్ణయం.. అరీయాన్ 6 రాకెట్ బ్లాక్ 3 అప్‌గ్రేడ్ రద్దు
యూరప్ కీలక నిర్ణయం.. అరీయాన్ 6 రాకెట్ బ్లాక్ 3 అప్‌గ్రేడ్ రద్దు

Ariane 6: యూరప్ కీలక నిర్ణయం.. అరీయాన్ 6 రాకెట్ బ్లాక్ 3 అప్‌గ్రేడ్ రద్దు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 21, 2026
01:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

యూరప్‌కు చెందిన ప్రధాన అంతరిక్ష రాకెట్ అరీయాన్ 6లో చేపట్టాల్సిన 'బ్లాక్ 3' అప్‌గ్రేడ్‌ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) రద్దు చేసింది. ఈ నిర్ణయాన్ని గురువారం యూరోపియన్ స్పేస్‌ఫ్లైట్ తొలిసారిగా వెల్లడించింది. బ్లాక్ 3 అప్‌గ్రేడ్‌లో భాగంగా కార్బన్-కాంపోజిట్ నిర్మాణాలతో రూపొందించే తేలికపాటి 'ఐకారస్' (ICARUS) అప్పర్ స్టేజ్‌ను ఏర్పాటు చేయాలని తొలుత భావించారు. అరీయాన్ 6 బ్లాక్ 3 అప్‌గ్రేడ్ రద్దు నిర్ణయం ESA చేపట్టే పలు శాస్త్రీయ మిషన్లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా శని గ్రహం చుట్టూ ఉన్న మంచుతో కూడిన ఉపగ్రహం ఎన్‌సెలడస్‌కు పంపాలని భావిస్తున్న ఓ మిషన్‌పై కూడా దీని ప్రభావం ఉండొచ్చనే చర్చ జరుగుతోంది.

వివరాలు 

అరీయాన్ 6కు పెరుగుతున్న ఖర్చుల భారం

ఈ పరిణామంతో అరీయాన్ 6 కార్యక్రమం భవిష్యత్తుపైనా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

అయితే ఇప్పటివరకు అరీయాన్ 6 యూరప్‌కు కీలకమైన ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపేందుకు నమ్మకమైన మార్గంగా నిలిచింది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో యూరప్ రష్యా రాకెట్లను ఉపయోగించడం నిలిపివేసిన తర్వాత అరీయాన్ 6 ప్రాధాన్యం మరింత పెరిగింది.

దీంతో యూరప్‌కు స్వతంత్రంగా అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించుకునే సామర్థ్యం కొనసాగింది.

మరోవైపు అరీయాన్ 6 భవిష్యత్తుకు అధిక ప్రయోగ ఖర్చులు పెద్ద సమస్యగా మారుతున్నాయి.

రాకెట్ అభివృద్ధికి నిధులు అందించే యూరప్ దేశాల మంత్రులు బ్లాక్ 3 వంటి అప్‌గ్రేడ్‌లపై ఆసక్తి తగ్గిస్తున్నట్లు సమాచారం.

ఇది రాకెట్ నిర్వహణ, ప్రయోగాలకు అవుతున్న ఖర్చులపై వారికి పెరుగుతున్న అసంతృప్తికి సంకేతంగా భావిస్తున్నారు.

వివరాలు 

అరీయాన్ 6 ప్రయోగాలకు భారీ ఖర్చు.. ప్రభుత్వాలపై పెరుగుతున్న సబ్సిడీ భారం

ఫ్రాన్స్‌కు చెందిన ఏరియన్‌స్పేస్ అరీయాన్ 6 ఒక్క ప్రయోగానికి అయ్యే ఖర్చును అధికారికంగా వెల్లడించలేదు.

అయితే ఒక్క ప్రయోగానికి సుమారు 8కోట్ల నుంచి 10కోట్ల యూరోలు ఖర్చవుతున్నట్లు అంచనా.

ప్రైవేటు సంస్థల కోసం చేపట్టే ప్రయోగాల్లో కూడా యూరప్‌కు పెద్దగా ఆర్థిక లాభం ఉండటం లేదని తెలుస్తోంది.

అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ కూడా అరీయాన్ 6 ద్వారా తన 'అమెజాన్ లియో' ఉపగ్రహ సమూహం కోసం 18 ప్రయోగాలకు ఒప్పందం చేసుకుంది.

ESA డైరెక్టర్ జనరల్ జోసెఫ్ అష్‌బాచర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఏడాదికి తొమ్మిది ప్రయోగాలు నిర్వహిస్తే ప్రతి అరీయాన్ 6 ప్రయోగానికి యూరప్ ప్రభుత్వాలు సుమారు 3.2కోట్ల నుంచి 3.8 కోట్ల యూరోల వరకు సబ్సిడీ ఇవ్వాల్సి ఉంటుంది.

ADVERTISEMENT

వివరాలు 

అరీయాన్ 6 ప్రయోగాల సంఖ్య పెంచనున్న యూరప్

అంటే ఏరియన్‌స్పేస్‌కు కస్టమర్ల నుంచి వచ్చే మొత్తానికి ముందే ప్రతి ప్రయోగానికి యూరప్ పన్ను చెల్లింపుదారుల నుంచి 10 కోట్ల యూరోలకు పైగా నిధులు వెళ్తున్న పరిస్థితి ఉందని తెలుస్తోంది.

అయినప్పటికీ అరీయాన్ 6 ప్రయోగాల సంఖ్యను పెంచాలని యూరప్ భావిస్తోంది.

ఏడాదికి తొమ్మిది లేదా పది సార్లు రాకెట్‌ను ప్రయోగించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ప్రయోగాలకు డిమాండ్ పెరుగుతుండటం,ప్రస్తుతం ఉన్న ప్రయోగ సామర్థ్యం పరిమితంగా ఉండటంతో మరిన్ని అరీయాన్ 6 రాకెట్లను తయారు చేసే అవకాశాలపైనా చర్చ జరుగుతోంది.

వచ్చే ఏడాది పది ప్రయోగాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా యూరప్ ముందుకు సాగుతోందని అష్‌బాచర్ తెలిపారు.

భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని మరింత పెంచే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ADVERTISEMENT