
AI Tools : ChatGPT అధిక వాడకం.. విద్యార్థుల మెదడు సామర్థ్యంపై ప్రతికూల ప్రభావం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రస్తుత కాలంలో ఉన్న యువత, విద్యార్థులు సమాచారం సులభంగా సమాచారాన్ని పొందడంలో ఎక్కువగా ChatGPT ను ఆధారంగా తీసుకుంటున్నారు. ఇది సమాచారం సులభంగా లభిస్తుందన్న ఆలోచనను పెంచింది, కానీ దీని ప్రభావం విమర్శనాత్మక ఆలోచనా సామర్థ్యంపై ప్రతికూలంగా ఉండొచ్చని కొత్త అధ్యయనం సూచిస్తోంది. MIT మీడియా ల్యాబ్ పరిశోధకుల తాజా పరిశీలన ప్రకారం, ChatGPT అధిక వాడకం మెమదడుపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు, ముఖ్యంగా జ్ఞాపక శక్తి తగ్గే అవకాశాలు ఉన్నాయని వెల్లడైంది. ఈ పరిశోధనలో బోస్టన్ ప్రాంతంలో 18 నుంచి 39 సంవత్సరాల వయస్సు గల 54 మందిని మూడు గ్రూపులుగా విభజించారు.
Details
స్థిరంగా పనితీరు చూపలేకపోతున్నారు
మొదటి గ్రూప్ OpenAI ChatGPT ఉపయోగించి వ్యాసాలు రాయమని, రెండవ గ్రూప్ Google శోధన ఇంజిన్ ఆధారంగా వ్యాసాలు రాయమని, మూడవ గ్రూప్ ఏ సాధనంలేకుండా SAT వ్యాసాలు రాయమని కోరారు. మొత్తం 32 ప్రాంతాల్లో EEG సౌకర్యం ద్వారా రచయితల మెదడు కార్యకలాపాలను రికార్డ్ చేశారు. తీర్మానంగా ChatGPT వినియోగదారుల మెదడు అత్యల్పంగా ఉంది, నాడీ, భాషా, ప్రవర్తనా స్థాయిలలో స్థిరంగా పనితీరు చూపలేకపోయారు. కొన్ని నెలల తరువాత, పరిశోధకులు ఈ గమనాలను నిర్ధారిస్తూ, ChatGPT వాడకం అధికంగా ఉన్నవారిలో 'కాఫీ పేస్ట్' విధంగా స్వతహాగా మెదడు పనితీరు తగ్గినట్లు గుర్తించారు.