Social Media: ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌కు అంతరాయం.. ఇబ్బందుల్లో యూజర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలో మెటాకు చెందిన సామాజిక మాధ్యమ వేదికలు ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ సేవలకు ఆదివారం అంతరాయం ఏర్పడింది. వేలాది మంది యూజర్లు ఈ రెండు ప్లాట్‌ఫామ్‌లలో సమస్యలు ఎదుర్కొన్నట్లు ఫిర్యాదులు చేశారు. సేవల అంతరాయాలను వివిధ వనరుల నుంచి వచ్చిన నివేదికలను సేకరించి నమోదు చేసే డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9:11 గంటల సమయానికి ఫేస్‌బుక్‌కు సంబంధించిన సమస్యలపై 17 వేలకు పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి.
వివరాలు
5 వేలకు పైగా అంతరాయాల నివేదికలు
ఇన్‌స్టాగ్రామ్ సేవలకు సంబంధించి 5 వేలకు పైగా అంతరాయాల నివేదికలు వచ్చాయి.
ఈ వ్యవహారంపై రాయిటర్స్ స్పందన కోరగా మెటా వెంటనే స్పందించలేదు.
కాగా, డౌన్‌డిటెక్టర్‌లో నమోదయ్యే సంఖ్యలు యూజర్లు స్వయంగా ఇచ్చే నివేదికల ఆధారంగా ఉంటాయి.
అందువల్ల వాస్తవంగా ప్రభావితమైన యూజర్ల సంఖ్య ఈ గణాంకాల కంటే ఎక్కువగా లేదా తక్కువగా ఉండే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
మెటా ప్లాట్‌ఫామ్‌లకు అంతరాయం
'DI MAKAPAG-FB O IG? Hindi ka nag-iisa.
— ABS-CBN News (@ABSCBNNews) September 21, 2026
Some users are currently having trouble accessing Meta services including Facebook, Instagram, Messenger, and Threads, as of Monday morning, September 21, 2026. #facebookdown #instagramdown pic.twitter.com/E4eWFOwTgo