Loading...
Fake Google Chrome: నకిలీ గూగుల్ క్రోమ్ యాప్‌తో ప్లే స్టోర్‌లో కలకలం.. లక్షకు పైగా డౌన్‌లోడ్స్
నకిలీ గూగుల్ క్రోమ్ యాప్‌తో ప్లే స్టోర్‌లో కలకలం.. లక్షకు పైగా డౌన్‌లోడ్స్

Fake Google Chrome: నకిలీ గూగుల్ క్రోమ్ యాప్‌తో ప్లే స్టోర్‌లో కలకలం.. లక్షకు పైగా డౌన్‌లోడ్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 15, 2026
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

స్మార్ట్‌ఫోన్‌లో సురక్షితంగా యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి చాలా మంది గూగుల్ ప్లే స్టోర్‌ను నమ్ముతుంటారు. అయితే అధికారిక యాప్ స్టోర్‌లోనూ సైబర్ నేరగాళ్లు, నకిలీ డెవలపర్లు మోసాలకు పాల్పడుతున్నారనే విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. ప్రముఖ బ్రౌజర్ గూగుల్ క్రోమ్‌ను పోలిన ఓ నకిలీ యాప్ ప్లే స్టోర్‌లో ఏకంగా లక్షకు పైగా డౌన్‌లోడ్స్ సాధించింది. అసలు యాప్ పేరుతో పాటు ఐకాన్‌ను కూడా పోలి ఉండేలా రూపొందించిన ఈ అప్లికేషన్ సెర్చ్ ఫలితాల్లో అసలైన క్రోమ్ కంటే పైన కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.

వివరాలు 

ఆగస్టులో గేమ్‌గా ఎంట్రీ.. సెప్టెంబర్‌లో క్రోమ్‌గా మార్పు

ఫోన్‌అరేనా నివేదిక ప్రకారం.. హిజ్బర్టెక్ అనే డెవలపర్ ఈ నకిలీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి తీసుకొచ్చాడు.

తొలుత ఆగస్టు 22న 'బాల్ బౌన్స్' అనే సాధారణ గేమ్‌గా దీనిని ప్రవేశపెట్టారు.

అనంతరం సెప్టెంబర్ 30 నాటికి యాప్ పేరును అకస్మాత్తుగా 'Chrome'గా మార్చి, అసలైన గూగుల్ క్రోమ్ ఐకాన్‌ను జోడించారు.

దీంతో వినియోగదారులు అసలు యాప్‌గా భావించే అవకాశం ఏర్పడింది.

రెడిట్‌లో ఓ యూజర్ షేర్ చేసిన స్క్రీన్‌షాట్‌ల ద్వారా ఈ వ్యవహారం బయటపడింది. విషయం గూగుల్ దృష్టికి చేరడంతో ఆ నకిలీ యాప్‌ను ప్లే స్టోర్ నుంచి తొలగించారు.

వివరాలు 

బ్రౌజర్ కాదు.. వింతైన ఏఐ చాట్‌బాట్

ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసి పరిశీలించిన కొంతమంది వినియోగదారులు ఆశ్చర్యకరమైన విషయాలను గుర్తించారు.

యాప్‌ను ఓపెన్ చేసినప్పుడు వెబ్‌సైట్లను సెర్చ్ చేసే అవకాశం కనిపించలేదు.

దానికి బదులుగా ఏఐ అవతార్, విచిత్రమైన చాట్ ఆప్షన్లు దర్శనమిచ్చాయి.

ప్రశ్నలు అడిగితే సంబంధం లేని వింత సమాధానాలు వచ్చాయి.

దీంతో ఈ అప్లికేషన్‌కు వెబ్ బ్రౌజింగ్ సేవలతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టమైంది.

అయితే ఈ యాప్ ద్వారా వినియోగదారుల డేటా చోరీ జరిగిందా? ఇందులో హానికరమైన మాల్వేర్ ఉందా? అనే విషయాలపై ఇప్పటివరకు స్పష్టమైన ఆధారాలు లభించలేదు.

ADVERTISEMENT

వివరాలు 

గూగుల్ భద్రతా తనిఖీలపై సందేహాలు

గూగుల్ ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న యాప్‌లు సురక్షితమైనవేనని చాలామంది వినియోగదారులు భావిస్తారు.

అయితే లక్షకు పైగా డౌన్‌లోడ్స్ వచ్చే వరకు ఈ నకిలీ యాప్‌ను గుర్తించకపోవడం గూగుల్ భద్రతా తనిఖీలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ప్రపంచవ్యాప్తంగా అసలైన గూగుల్ క్రోమ్‌కు 10 బిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్ ఉన్నాయి.

ఇంతటి ఆదరణ ఉన్న బ్రౌజర్ పేరును, ఐకాన్‌ను పోలిన నకిలీ యాప్ సెర్చ్ ఫలితాల్లో అగ్రస్థానంలో కనిపించడం సాంకేతిక నిపుణులను విస్మయానికి గురిచేసింది.

ADVERTISEMENT

వివరాలు 

నకిలీ యాప్‌ల బారిన పడకుండా ఇలా జాగ్రత్తపడండి

యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకునే ముందు కొన్ని ప్రాథమిక జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని సైబర్ భద్రతా నిపుణులు సూచిస్తున్నారు. -

డెవలపర్ పేరును పరిశీలించండి: గూగుల్ క్రోమ్ లేదా ఇతర గూగుల్ యాప్‌లను ఇన్‌స్టాల్ చేసే ముందు డెవలపర్ పేరు 'Google LLC' అని ఉందో లేదో సరిచూసుకోండి.

రివ్యూలు, రేటింగ్‌లు చూడండి: యాప్‌కు వచ్చిన వినియోగదారుల సమీక్షలు, రేటింగ్‌లు, మొత్తం డౌన్‌లోడ్స్ సంఖ్యను పరిశీలించండి.

సెర్చ్ ఫలితాలను గుడ్డిగా నమ్మవద్దు: సెర్చ్ ఫలితాల్లో లేదా ప్రకటనల్లో యాప్ మొదటి స్థానంలో కనిపించినంత మాత్రాన అది అసలైనదని భావించకండి.

అధికారిక వివరాలను నిర్ధారించుకోండి: యాప్ పేరు, ఐకాన్‌తో పాటు డెవలపర్ వివరాలను కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే ఇన్‌స్టాల్ చేయండి.

ADVERTISEMENT