Germany: జర్మనీలో వింత ఘటన.. 16 ఏళ్ల బాలికను వేధించిన రోబో.. ఇద్దరిపై కేసు
ఈ వార్తాకథనం ఏంటి
జర్మనీలో ఓ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికను ఓ రోబో అసభ్యకరంగా తాకినట్లు ఆరోపణలు రావడం స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటనను వీడియోగా చిత్రీకరించడంతో పాటు,సోషల్ మీడియాలో లైవ్‌స్ట్రీమింగ్ చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై పోలీసులు ఇద్దరు యువకులపై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఘటనలో ఉపయోగించిన రోబోను స్వాధీనం చేసుకున్నారు. జర్మనీలోని కొలోన్ నగరంలో హోహెన్‌జోలెర్న్‌రింగ్ వీధిలో ఆదివారం రాత్రి 11:45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఓ ఫాస్ట్‌ఫుడ్ రెస్టారెంట్ బయట తన స్నేహితులతో కలిసి నిల్చున్న 16ఏళ్ల బాలిక వద్దకు వెనుక నుంచి సుమారు 1.2మీటర్ల ఎత్తున్న రోబో వచ్చింది. అది బాలిక పిరుదులను తాకి, అసభ్యంగా ప్రవర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.
వివరాలు
రోబోను ఉద్దేశపూర్వకంగా నియంత్రించారా? అనే కోణంలో దర్యాప్తు
బాలిక నుంచి ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
అనుమానితులకు చెందిన కారును తనిఖీ చేయగా,దాని డిక్కీలో రోబో కనిపించింది.
దీంతో దానిని స్వాధీనం చేసుకున్నారు.రోబోకు యజమానిగా భావిస్తున్న 16 ఏళ్ల యువకుడు, అతని 19 ఏళ్ల స్నేహితుడు కలిసి ఈ ఘటనకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
విచారణలో భాగంగా వారిద్దరి మొబైల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై లైంగిక వేధింపులకు సంబంధించిన అనుమానాలతో క్రిమినల్ దర్యాప్తు ప్రారంభించినట్లు కొలోన్ పోలీసులు తమ ప్రకటనలో పేర్కొన్నారు.
బాలికను వేధించాలనే ఉద్దేశంతోనే రోబోను రిమోట్ కంట్రోల్ ద్వారా నడిపించారా అనే అంశంపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
జర్మనీలోని కొలోన్‌లో 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు
‼️BREAKING: German police seized a robot that sexually assaulted a 16-year-old girl by touching her ass and making thrusting motions at her.
— International Cyber Digest (@IntCyberDigest) October 12, 2026
Officers found it stashed in the boot of a Volkswagen.
Its 16-year-old owner and a 19-year-old companion allegedly livestreamed it. pic.twitter.com/MTUBuXcgtT