Harvard scientist: దేవుడు ఉన్నాడు..గణిత సూత్రంతో దేవుడి ఉనికి కనుగొనే ఛాన్స్.. శాస్త్రవేత్త సంచలన పరిశోధన...
ఈ వార్తాకథనం ఏంటి
దేవుడు ఉన్నాడా లేదా? ఉంటే ఎక్కడ ఉంటాడు? ఆయన స్వరూపం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలు ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమవడం సహజమే.
అయితే ఇప్పటివరకు శాస్త్రీయంగా దేవుని ఉనికి గురించి స్పష్టమైన అధ్యయనం అందుబాటులోకి రాలేదు.
అయితే, హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన గణిత, ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ (Dr. Willie Soon) "Fine-Tuning Argument" అనే సిద్ధాంతం ద్వారా గణిత శాస్త్రసూత్రాల ఆధారంగా దేవుని ఉనికిని వివరించవచ్చని పేర్కొన్నారు.
ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలను తెలుసుకుందాం.
వివరాలు
పురాణ, ఆధునిక విజ్ఞానం
మహాభాగవత పురాణంలో హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ప్రశ్నిస్తూ,శ్రీ మహావిష్ణువు ఎక్కడ ఉన్నాడని అడిగినప్పుడు,ప్రహ్లాదుడు "ఇందు గలడు, అందు లేదు సందేహం వలదు... ఎంత వెతికినా అంతటా గలడు" అని సమాధానం ఇచ్చాడు.
అంటే, భగవంతుడు ప్రతి అణువులోనూ,ప్రతి జీవిలోనూ, అంతటా వ్యాపించి ఉన్నాడని ప్రహ్లాదుడు వివరణ ఇచ్చాడు.
ప్రస్తుత శాస్త్ర విజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. విశ్వానికి మూలకారణం ఏమిటనే విషయాన్ని శాస్త్రజ్ఞులు విశ్లేషించే స్థాయికి చేరుకున్నారు.
అయితే, శాస్త్ర విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ, ఆధ్యాత్మిక భావనలు తగ్గుతున్నాయని, హేతువాద దృక్కోణం పెరుగుతున్నట్లు భావిస్తున్నారు.
దైవం ఉనికిపై నాస్తికులు, ఆస్తికులు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పటికీ దేవుడు ఉన్నాడని లేదా లేడని పూర్తిగా రుజువు చేయగలిగిన ఆధారాలు లేవు.
వివరాలు
హార్వర్డ్ శాస్త్రవేత్త విల్లీ సూన్ పరిశోధన
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త డాక్టర్ విల్లీ సూన్ తన పరిశోధనలో విశ్వం అంతా ఒక ప్రత్యేకమైన గణిత సమతుల్యతతో (Fine-Tuning) రూపుదిద్దుకుందని తెలిపారు.
ఆయన పరిశోధన ప్రకారం, విశ్వం యాదృచ్ఛికంగా ఏర్పడలేదు. ఇందులో ఒక స్పష్టమైన డిజైన్ ఉంది.
జీవం ఉనికికి కావలసిన అన్ని పరిస్థితులు ఎంతో సమతుల్యంగా ఏర్పడ్డాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది కేవలం ప్రమాదశక్యం కాదు, ఒక నిర్దిష్టమైన సృష్టి ప్రక్రియ అయి ఉండొచ్చని చెప్పారు.
వివరాలు
Matter & Antimatter సిద్ధాంతం
డాక్టర్ విల్లీ సూన్ ప్రకారం, బిగ్ బ్యాంగ్ సమయంలో విశ్వంలో Matter (పదార్థం)Antimatter (వ్యతిరేక పదార్థం) సమానంగా ఏర్పడ్డాయి.
అయితే, antimatter కొంతమేర తగ్గిపోయిన కారణంగా, విశ్వం స్థిరంగా ఉండగలిగింది.
ఈ సమతుల్యత లేకుంటే విశ్వం స్థిరంగా ఉండేది కాదని ఆయన విశ్లేషించారు.
ఆయన అభిప్రాయం ప్రకారం, ఈ సమతుల్యత యాదృచ్ఛికంగా కాకుండా, ఒక ప్రత్యేకమైన ఆకృతిలో ఏర్పడినట్లు కనిపిస్తోంది.
వివరాలు
దేవుని ఉనికిని సూచించే గణిత సమీకరణాలు
కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త ప్రొఫెసర్ Paul Dirac గణిత సమీకరణాల ద్వారా Negative Energy Electrons అనే కొత్త రేణువుల (Particles) ఉనికిని నిరూపించారు.
క్వాంటం ఫీల్డ్ థియరీ (Quantum Field Theory) ద్వారా, పదార్థం,వ్యతిరేక పదార్థం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు.
అంతేకాదు, బ్లాక్ హోల్ (Black Hole) ఉనికికి కూడా Negative Energy Electrons తో సహా antimatter ఒక కారణంగా ఉండొచ్చని పరిశోధనలో తేలింది.
దీన్ని బట్టి, విశ్వం పూర్తిగా యాదృచ్ఛికంగా ఏర్పడలేదని, దీని వెనుక ఒక ప్రత్యేకమైన ఆలోచన (Design) ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వివరాలు
దేవుని ఉనికిని గణిత శాస్త్రంతో నిరూపించగలమా?
Matter, Antimatter గురించి విశ్లేషణ జరిపినప్పటికీ, భౌతిక శాస్త్ర గణిత సమీకరణాల ద్వారా దేవుని ఉనికిని ఇప్పటికీ నిరూపించలేకపోయారు.
అయితే, విశ్వం నిర్దిష్ట సమతుల్యతతో నిర్మితమైనట్లు కనిపిస్తుండటంతో, ఇది యాదృచ్ఛికంగా కాకుండా, ఒక ప్రత్యేకమైన సృష్టి అయిన అవకాశాన్ని సూచిస్తున్నాయి.
క్వాంటం ఫీల్డ్ థియరీ ఇంకా అభివృద్ధి చెందుతున్న కొద్దీ, కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.