LOADING...
Free AI Training: యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఏఐ ప్రోగ్రామ్‌తో క్రియేటివ్ స్కిల్స్ నేర్చుకోండి!
యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఏఐ ప్రోగ్రామ్‌తో క్రియేటివ్ స్కిల్స్ నేర్చుకోండి!

Free AI Training: యువతకు గోల్డెన్ ఛాన్స్.. ఏఐ ప్రోగ్రామ్‌తో క్రియేటివ్ స్కిల్స్ నేర్చుకోండి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 29, 2026
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులను తీసుకువస్తోంది. ప్రపంచం నలుమూలలా తన ప్రభావాన్ని చూపుతున్న ఏఐ, భారత్‌లో కూడా పని విధానాలను మార్చుతూ క్రమంగా తన పరిధిని విస్తరిస్తోంది. ఒకవైపు చాలామంది యువత దీన్ని ఉద్యోగాలకు ముప్పుగా భావిస్తుండగా మరోవైపు మరికొందరు దీన్ని నేర్చుకుని కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలని చూస్తున్నారు. ఇలాంటి ఆసక్తి ఉన్న యువత కోసం వీడియో క్రియేషన్, మీమింగ్, యానిమేషన్ వంటి ఏఐ ఆధారిత రంగాల్లో కెరీర్‌ను కొనసాగించాలనుకునే వారికి ప్రత్యేక అవకాశాన్ని అందిస్తూ గూగుల్, యూట్యూబ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ సంయుక్తంగా ఒక ప్రత్యేక ఏఐ శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించాయి.

వివరాలు

ఎంపికైన వారికి నెలకు రూ.15వేలు స్కాలర్ షిప్

ఈ కార్యక్రమంలో ఎంపికైన వారికి నెలకు రూ.15,000 స్కాలర్‌షిప్ కూడా అందించనున్నారు. ఈ శిక్షణ ద్వారా యువతకు సృజనాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకునే అవకాశం లభిస్తుంది. వీడియో ప్రొడక్షన్, యానిమేషన్, గేమింగ్ వంటి రంగాల్లో ఆధునిక సాంకేతికతను నేర్చుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీడియా, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ స్టోరీటెల్లింగ్ వంటి విభాగాలపై ఈ కోర్సు దృష్టి సారిస్తుంది. కంటెంట్ క్రియేషన్‌ను వృత్తిగా ఎంచుకోవాలనుకునే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ శిక్షణ కార్యక్రమం రెండు దశల్లో నిర్వహించబడుతుంది. మొదటి దశలో గూగుల్ కెరీర్ సర్టిఫికేట్, గూగుల్ క్లౌడ్ ఏఐ కోర్సుల ద్వారా ఏఐపై ప్రాథమిక అవగాహన కల్పిస్తారు.

వివరాలు

యువతకు విలువైన అవకాశం

రెండవ దశలో పూర్తిగా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇస్తారు. ఇందులో పాల్గొనే వారు ప్రాజెక్టులపై పనిచేయడం, ఏఐ టూల్స్‌ను సమర్థంగా ఉపయోగించడం వంటి నైపుణ్యాలను అభ్యసిస్తారు. అదనంగా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో వేగంగా ఎదగడానికి అవసరమైన చిట్కాలు కూడా వారికి అందించబడతాయి. ఈ శిక్షణ దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో నిర్వహించనున్నారు. మొత్తంగా, ఏఐ రంగంలో కెరీర్‌ను నిర్మించాలనుకునే యువతకు ఇది ఒక విలువైన అవకాశం.

Advertisement