Page Loader
Apple TV: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాపిల్ టీవీ యాప్ లాంచ్!
ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాపిల్ టీవీ యాప్ లాంచ్!

Apple TV: ఆండ్రాయిడ్ యూజర్లకు గుడ్ న్యూస్.. యాపిల్ టీవీ యాప్ లాంచ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 13, 2025
11:23 am

ఈ వార్తాకథనం ఏంటి

టెక్‌ దిగ్గజం యాపిల్‌ తన ఆపిల్‌ టీవీ సేవలను మరింత విస్తృతం చేసింది. యాపిల్ ఒరిజినల్ సిరీస్‌లను ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు కూడా వీక్షించవచ్చు. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఫోల్డబుల్ మొబైల్స్‌లో యాపిల్ టీవీ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఈ సేవలు ఇప్పటికే యూజర్లకు లభిస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా యాపిల్ టీవీ అందుబాటులోకి వచ్చినట్లు టెక్‌ దిగ్గజం స్పష్టం చేసింది. గూగుల్ ప్లే అకౌంట్ ద్వారా యాపిల్ టీవీ+, ఎంఎల్‌ఎస్ సీజన్ పాస్‌లను యూజర్లు వినియోగించుకోవచ్చని తెలిపింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవలను పొందవచ్చని వివరించింది.

Details

ఏడు రోజుల పాటు ఉచితం

అయితే ఈ యాప్ అన్ని ఆండ్రాయిడ్ డివైజ్‌లకు మద్దతు ఇవ్వదు. ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే పై వర్షన్‌తో నడిచే డివైజ్‌లకు మాత్రమే సపోర్ట్ చేస్తుందని స్పష్టం చేసింది. యాపిల్ టీవీ+ సేవలను 7 రోజుల ఉచిత ట్రయల్‌తో అందిస్తోంది. ఐక్లౌడ్ ఖాతా ఉన్న వినియోగదారులు తమ ఐక్లౌడ్ ఐడీని ఉపయోగించి లాగిన్ కావచ్చు. వాచ్‌లిస్ట్, కంటిన్యూ వాచింగ్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. వైఫై, మొబైల్ నెట్‌వర్క్‌తో సపోర్ట్ చేయడంతో పాటు, ఆఫ్‌లైన్ కంటెంట్ వీక్షించేందుకు డౌన్‌లోడ్ చేసుకునే ఫీచర్‌ను కూడా అందిస్తోంది.