LOADING...
Network Coverage Maps: టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. కవరేజ్ మ్యాప్‌లు వెబ్‌సైట్లలో లైవ్!
టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. కవరేజ్ మ్యాప్‌లు వెబ్‌సైట్లలో లైవ్!

Network Coverage Maps: టెలికాం యూజర్లకు గుడ్ న్యూస్.. కవరేజ్ మ్యాప్‌లు వెబ్‌సైట్లలో లైవ్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 10, 2025
06:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టెలికాం సేవల వినియోగదారులకు ఉపయోగపడే మరో కీలక మార్గదర్శకం లభ్యమైంది. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు, టెలికాం సర్వీస్ సంస్థలు తమ మొబైల్ నెట్‌వర్క్ కవరేజ్ మ్యాప్‌లను అధికారిక వెబ్‌సైట్లలో ప్రచురించాయి. ట్రాయ్ పారదర్శకతను మెరుగుపరచేందుకు, వినియోగదారులకు సమాచారం అందించేందుకు ఈచర్య తీసుకుంది. ట్రాయ్ వెబ్‌సైట్‌లోనూ సంబంధిత కంపెనీల మ్యాప్‌లకు లింకులు అందుబాటులో ఉన్నాయి. మొబైల్ యూజర్లు తమ ప్రాంతంలో అందుబాటులో ఉన్న నెట్‌వర్క్ సేవల స్థితిని ఈ మ్యాప్‌ల ద్వారా పూర్తిగా తెలుసుకోవచ్చు. జియోస్పేషియల్ లొకేషన్ ఆధారంగా ఈ కవరేజ్ మ్యాప్‌లు రూపొందించారు. ట్రాయ్ నిబంధనల ప్రకారం, ఏప్రిల్ 1వ తేదీ లోగా ఈ మ్యాప్‌లను టెలికాం కంపెనీలు తమ వెబ్‌సైట్లలో అప్‌లోడ్ చేయాల్సిన అవసరం ఉంది.

Details

కవరేజ్ మ్యాప్ ను విడుదల చేయని బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్

భారతి ఎయిర్‌టెల్, రిలయెన్స్ జియో, వోడాఫోన్ ఐడియా వంటి సంస్థలు ఇప్పటికే ఈ కవరేజ్ మ్యాప్‌లను విడుదల చేశాయి. కానీ బీఎస్ఎన్ఎల్ (BSNL), ఎంటీఎన్ఎల్ (MTNL)మాత్రం ఇంకా తమ మ్యాప్‌లను లైవ్ చేయలేదు. ట్రాయ్ వారి వెబ్‌సైట్‌లో ఈ సంస్థల మ్యాప్‌లకు సంబంధించిన లింకులు కూడా పొందుపరిచింది. కవరేజ్ మ్యాప్‌లు యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లతో రూపొందించబడ్డాయి. వినియోగదారులు తమ ప్రాంతంలో 2జీ, 3జీ, 4జీ లేదా 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉందో సులభంగా తెలుసుకోవచ్చు. వివిధ రంగులతో కవరేజ్ స్థాయిని మ్యాప్‌లో చూపించారు. తమ డేటా ప్లాన్ మార్చుకోవాలనుకుంటున్న వినియోగదారులు ఈ మ్యాప్ ఆధారంగా ఆ నిర్ణయం తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ మ్యాప్‌లు వినియోగదారులను సమాచారం పరంగా బలోపేతం చేస్తాయని ట్రాయ్ తెలిపింది.