LOADING...
Google AI Edge: ఇంటర్నెట్ లేకుండా AI వాడే గూగుల్ యాప్.. సెకన్‌లో ఇమేజ్‌లు సృష్టించవచ్చు!
ఇంటర్నెట్ లేకుండా AI వాడే గూగుల్ యాప్.. సెకన్‌లో ఇమేజ్‌లు సృష్టించవచ్చు!

Google AI Edge: ఇంటర్నెట్ లేకుండా AI వాడే గూగుల్ యాప్.. సెకన్‌లో ఇమేజ్‌లు సృష్టించవచ్చు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 28, 2025
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రస్తుతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో కొత్త ట్రెండ్స్ వేగంగా వస్తున్నాయి. బనానా ఎఐ, గిబ్లీ వంటి ఏఐ టూల్స్ ద్వారా రకరకాల ఇమేజ్ క్రియేషన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గూగుల్ కూడా కొత్త AI టూల్ ను పరిచయం చేసింది. ఈ టూల్ ద్వారా ఇంటర్నెట్ లేకుండానే AI ఇమేజ్‌లు సృష్టించవచ్చు. సాధారణంగా, ఏఐ టూల్స్ వాడడానికి ఇంటర్నెట్ అవసరం. కానీ గూగుల్ తీసుకొచ్చిన 'Google AI Edge Gallery' యాప్ ఇంటర్నెట్ లేకుండా పనిచేస్తుంది. ఈ యాప్ ద్వారా వివిధ AI ఇమేజ్ ఎఫెక్ట్స్‌ను ఆఫ్‌లైన్‌లో సృష్టించడం, ఇమేజ్ కోడ్స్ లేదా ప్రాంప్ట్స్ తయారు చేసుకోవడం సాధ్యం.

Details

ప్రైవసీ సమస్యలు ఉండవు

మరొక ముఖ్య విషయమేమిటంటే ప్రైవసీ సమస్యలు లేవు. యూజర్లు అప్‌లోడ్ చేసే ఫోటోలు, ఇతర డేటా క్లౌడ్‌లో కాకుండా మొబైల్ స్టోరేజ్‌లోనే సేవ్ అవుతుంది. అందువల్ల ఇతర ఏఐ టూల్స్‌లోని ప్రైవసీ సమస్యలు Google AI Edge Galleryలో ఉండవు. యాప్ మొబైల్ బ్యాక్‌ఎండ్‌లో రన్ అవ్వడంతో సెక్యూరిటీ రిస్క్ కూడా తగ్గుతుంది. అలాగే ఆఫ్‌లైన్‌లో పనిచేయడంతో వేగంగా రిప్లై ఇస్తుంది. ఈ యాప్ Gamma 31B లాంగ్వేజ్ మోడల్‌పై ఆధారపడి పనిచేస్తుంది. ఇది Apache 2.0 లైసెన్స్‌తో అందుబాటులో ఉంది,

Details

కమర్షియల్ అవసరాల కోసం వినియోగించవచ్చు

కాబట్టి ఎడ్యుకేషనల్, కమర్షియల్ అవసరాల కోసం కూడా ఉపయోగించవచ్చు. యాప్ సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. అంటే యూజర్ అడిగిన క్షణంలోనే రిప్లై ఇస్తుంది. పెద్ద టెక్స్ట్‌లను కూడా జెనరేట్ చేయగల సామర్థ్యం ఉంది. ప్రస్తుతానికి Google AI Edge Gallery యాప్ ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉంది. అయితే iOS వెర్షన్ ఇంకా విడుదల కాలేదు.