Gmail: 183 మిలియన్ల Gmail పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. వార్తలను ఖండించిన గూగుల్
ఈ వార్తాకథనం ఏంటి
సోషల్ మీడియాలో సోమవారం(అక్టోబర్ 27) ఒక్కసారిగా ఆందోళన నెలకొంది. 183 మిలియన్‌కు పైగా జీమెయిల్ పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయని వార్తలు వెలువడటంతో నెటిజన్లు భయాందోళనకు గురయ్యారు. అయితే, గూగుల్ ఈ వార్తలను పూర్తిగా ఖండించింది. జీమెయిల్ సెక్యూరిటీలో కొత్తగా ఎలాంటి చోరీ జరగలేదని స్పష్టం చేసింది. ఈ విషయమై గూగుల్ ఎక్స్ లో వివరణ ఇచ్చింది. "ఈ వార్తలు నిజం కావు. ఇవి 'ఇన్ఫోస్టీలర్ డేటాబేస్' అనే పాత హ్యాకింగ్ వివరాలను తప్పుగా అర్థం చేసుకోవడం వల్లే వచ్చాయి" అని కంపెనీ పేర్కొంది. ఈ డేటాబేస్‌లలో వేర్వేరు సైట్లలో జరిగిన హ్యాకింగ్, మాల్వేర్ దాడుల ద్వారా దొంగిలించిన పాస్‌వర్డ్‌లు ఉండవచ్చు కానీ ఇవి జీమెయిల్‌పై జరిగిన కొత్త దాడులు కావని స్పష్టంచేసింది.
వివరాలు
పాస్‌వర్డ్ రీసెట్ చేసే చర్యలు
"మిలియన్ల మంది యూజర్లపై ప్రభావం చూపిన జీమెయిల్ సెక్యూరిటీ ఉల్లంఘనలపై వస్తున్న వార్తలు పూర్తిగా తప్పు. జీమెయిల్ రక్షణ వ్యవస్థలు బలంగా ఉన్నాయి. యూజర్లు సురక్షితంగా ఉన్నారు," అని గూగుల్ అధికారిక ప్రకటనలో తెలిపింది. హ్యాకర్లు తరచుగా పాత లేదా సంబంధం లేని ఇమెయిల్-పాస్‌వర్డ్ జాబితాలను ఇంటర్నెట్‌లో పోస్ట్ చేస్తుంటారని గూగుల్ వివరించింది. అలాంటి పాత డేటా బయటపడితే ప్రజల్లో కొత్త హ్యాకింగ్ జరిగిందన్న అపోహలు కలుగుతాయని పేర్కొంది. అయితే, ఇలాంటి పెద్ద ఎత్తున లీక్‌లు బయటపడిన వెంటనే గూగుల్ యూజర్ల అకౌంట్లను సురక్షితంగా ఉంచేందుకు వెంటనే పాస్‌వర్డ్ రీసెట్ చేసే చర్యలు తీసుకుంటుందని తెలిపింది.
వివరాలు
కోట్లాది జీమెయిల్ వినియోగదారుల్లో ఆందోళన
ఈ సమయంలో, యూజర్లు తమ అకౌంట్ల భద్రతను ఇంకా పటిష్టంగా చేసుకోవాలని గూగుల్ సూచించింది. రెండు-దశల ధృవీకరణ (2-Step Verification)ను ప్రారంభించటం, పాస్‌కీ (passkey)లను ఉపయోగించడం, తమ పాస్‌వర్డ్‌లు లీక్ అయినట్లు కనబడితే వెంటనే మార్చుకోవాలని సూచించింది. ఈ తప్పుడు వార్త మొదట కొన్ని మీడియా సంస్థల్లో "జీమెయిల్ డేటా లీక్" అంటూ బయటకు రావడంతో మొదలైంది. కొద్ది గంటల్లోనే అది సోషల్ మీడియాలో వైరల్ అయి, కోట్లాది జీమెయిల్ వినియోగదారుల్లో ఆందోళన రేపింది. తాజా వివరణతో గూగుల్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీమెయిల్ వినియోగదారులకు ఊరట కల్పించింది. జీమెయిల్ రక్షణ వ్యవస్థలు ఇప్పటికీ బలంగా ఉన్నాయని, కొత్తగా ఎటువంటి చోరీ జరగలేదని గూగుల్ స్పష్టం చేసింది.