Loading...
Google Dreambeans: భారత్‌లోకి గూగుల్ డ్రీమ్‌బీన్స్ ఏఐ యాప్.. జీమెయిల్, ఫొటోలతో డిజిటల్ స్టోరీలు
భారత్‌లోకి గూగుల్ డ్రీమ్‌బీన్స్ ఏఐ యాప్.. జీమెయిల్,ఫొటోలతో డిజిటల్ స్టోరీలు

Google Dreambeans: భారత్‌లోకి గూగుల్ డ్రీమ్‌బీన్స్ ఏఐ యాప్.. జీమెయిల్, ఫొటోలతో డిజిటల్ స్టోరీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 03, 2026
02:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రముఖ టెక్ సంస్థ గూగుల్ తన ప్రయోగాత్మక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) యాప్‌ డ్రీమ్‌బీన్స్‌ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. 18 ఏళ్లు పైబడిన ఆండ్రాయిడ్, ఐఓఎస్ వినియోగదారుల కోసం నవంబర్ 3న ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. అమెరికా తర్వాత ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన తొలి అంతర్జాతీయ మార్కెట్ భారత్ కావడం విశేషం. గూగుల్ ల్యాబ్స్ అభివృద్ధి చేసిన ఈ యాప్.. వినియోగదారుల ఆసక్తులు, రోజువారీ కార్యకలాపాలకు అనుగుణంగా బొమ్మలు, వీడియోలతో కూడిన డిజిటల్ స్టోరీలను రూపొందిస్తుంది.

వివరాలు 

డ్రీమ్‌బీన్స్ ఎలా పనిచేస్తుంది?

సెర్చ్ బార్‌లో టైప్ చేయడం లేదా ఫీడ్‌ను స్క్రోల్ చేయడం అవసరం లేకుండానే డ్రీమ్‌బీన్స్ పనిచేస్తుంది.

జీమెయిల్, గూగుల్ ఫొటోస్, క్యాలెండర్, సెర్చ్, జెమిని, యూట్యూబ్ వంటి సేవలను ఈ యాప్‌తో అనుసంధానించుకోవచ్చు.

వినియోగదారులు అనుసంధానించిన ఖాతాల్లోని సమాచారాన్ని విశ్లేషించి..ప్రయాణాలు, కళలు-హస్తకళలు, స్థానిక కార్యక్రమాలు, రిమైండర్లకు సంబంధించిన ఆకర్షణీయమైన విజువల్ స్టోరీలను రోజూ ఆటోమేటిక్‌గా రూపొందిస్తుంది.

ప్రతి స్టోరీపై క్లిక్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో చూసేందుకు వాటిని సేవ్ చేసుకోవడంతో పాటు ఇతరులతో పంచుకునే అవకాశం కూడా ఉంది.

ప్రారంభంలో స్థిరమైన ఏఐ చిత్రాలకే పరిమితమైన ఈ యాప్‌లో ప్రస్తుతం'వీయో'(Veo)ఏఐ మోడల్ సాయంతో యానిమేటెడ్ వీడియోలను కూడా జోడించారు.

వినియోగదారులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్ ఆధారంగా ఈ స్టోరీల కలెక్షన్లు రూపొందుతాయి.

వివరాలు 

తెలుగు సహా 14 భాషల్లో..

డ్రీమ్‌బీన్స్ యాప్ ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, పంజాబీ, ఉర్దూ సహా మొత్తం 14 భాషలకు మద్దతు ఇస్తుంది.

అయితే ఒకేసారి ఒక భాషను మాత్రమే ఎంచుకునే అవకాశం ఉంది.

వేర్వేరు భాషల్లోని సమాచారాన్ని ప్రాసెస్ చేయగల సామర్థ్యం యాప్‌కు ఉన్నప్పటికీ.. హిందీ, ఇంగ్లీష్‌లను కలిపి ఒకే స్టోరీగా రూపొందించే బహుభాషా సదుపాయం ఇంకా అందుబాటులోకి రాలేదని గూగుల్ ప్రొడక్ట్ మేనేజర్ గాజ్డే ఓజ్నుర్ తెలిపారు.

ADVERTISEMENT

వివరాలు 

వ్యక్తిగత డేటా భద్రతపై గూగుల్ స్పష్టత

జీమెయిల్ వంటి వ్యక్తిగత ఖాతాల్లోని సమాచారాన్ని యాప్ విశ్లేషిస్తుండటంతో డేటా గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దీనిపై గూగుల్ స్పందిస్తూ.. వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన అనుభవాన్ని అందించేందుకు 'పర్సనల్ ఇంటెలిజెన్స్' సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు తెలిపింది.

వినియోగదారులు తమకు నచ్చిన గూగుల్ సేవలను మాత్రమే డ్రీమ్‌బీన్స్‌కు అనుసంధానించుకోవచ్చని, ఎప్పుడైనా ఆ అనుసంధానాన్ని తొలగించవచ్చని ఓజ్నుర్ వివరించారు.

అనుసంధానించిన సేవల్లోని ఏదైనా సమాచారాన్ని తొలగిస్తే.. డ్రీమ్‌బీన్స్ సిస్టమ్ నుంచి కూడా ఆ డేటా శాశ్వతంగా తొలగిపోతుందని గూగుల్ వెల్లడించింది.

వ్యాపారపరమైన సమాచారాన్ని స్టోరీలుగా చూపించవద్దని వినియోగదారులు యాప్‌ను కోరవచ్చు.

ఈ సదుపాయం కేవలం వ్యక్తిగత జీమెయిల్ ఖాతాలకు మాత్రమే పనిచేస్తుందని, రూపొందించిన స్టోరీలను సంబంధిత వినియోగదారు మాత్రమే చూడగలరని గూగుల్ స్పష్టం చేసింది.

ADVERTISEMENT

వివరాలు 

అమెరికా తర్వాత భారత్‌లోనే తొలి విస్తరణ

గూగుల్ ఈ ఏడాది జూన్‌లో అమెరికాలో డ్రీమ్‌బీన్స్ యాప్‌ను పరిచయం చేసింది. సెప్టెంబర్‌లో 18 ఏళ్లు పైబడిన వారందరికీ అందుబాటులోకి తెచ్చింది.

సెన్సార్ టవర్ విశ్లేషణల ప్రకారం.. అమెరికాలో ఇప్పటివరకు ఈ యాప్ 55,000 డౌన్‌లోడ్‌లను సాధించింది.

ఇందులో 63 శాతం డౌన్‌లోడ్‌లు సెప్టెంబర్‌లోనే నమోదయ్యాయి. అయితే అక్టోబర్‌లో నెలవారీ డౌన్‌లోడ్‌లు 84 శాతం తగ్గి 5,500కు పరిమితమయ్యాయి.

భారత్‌లో గూగుల్ సేవలను ఎక్కువ మంది ఉపయోగిస్తుండటం, వినియోగదారుల ఆసక్తి అధికంగా ఉండటంతోనే తొలి అంతర్జాతీయ విస్తరణకు ఈ దేశాన్ని ఎంచుకున్నట్లు కంపెనీ వెల్లడించింది.

రాబోయే రోజుల్లో ఈ స్టోరీల ఆధారంగా వినియోగదారులు నేరుగా చర్యలు తీసుకునేలా యాప్‌ను మరింత మెరుగుపరచనున్నట్లు తెలిపింది.

ADVERTISEMENT