Gmail ID change : జీమెయిల్ అడ్రస్ మార్చుకునే అవకాశం.. గూగుల్ సంచలన నిర్ణయం - పూర్తి వివరాలు
ఈ వార్తాకథనం ఏంటి
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో సంవత్సరాలుగా వినియోగదారులు ఎదురుచూస్తున్న కీలక ఫీచర్‌ను చివరికి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై యూజర్లు తమ ప్రైమరీ జిమెయిల్ అడ్రస్‌ను మార్చుకునే అవకాశం పొందుతున్నారు. ఇప్పటి వరకు ఒకసారి గూగుల్ అకౌంట్ సృష్టించిన తర్వాత ఆ మెయిల్ ఐడీని మార్చే అవకాశం లేకపోవడం వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇప్పుడు ఆ సమస్యకు పూర్తి పరిష్కారం లభించింది. ఈ కొత్త అప్‌డేట్ కేవలం జీమెయిల్‌కే పరిమితం కాకుండా Google Calendar, Google Photos, Google Drive వంటి అన్ని గూగుల్ సేవలకు వర్తిస్తుంది. అంటే మీ అకౌంట్‌లో ఉన్న మొత్తం డేటా యథాతథంగా కొనసాగుతుంది.
వివరాలు
అధికారికంగా అమలు
ప్రస్తుతం ఈ ఫీచర్ అమెరికాలోని వినియోగదారులకు దశలవారీగా అందుబాటులోకి వస్తోంది. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందించనున్నారు. నిజానికి ఈ ఫీచర్‌పై గూగుల్ ఇప్పటికే 2025 డిసెంబర్‌లోనే సంకేతాలు ఇచ్చింది. అప్పట్లో సపోర్ట్ పేజీలో చిన్న మార్పులు చేసి హింట్ ఇచ్చినా,ఇప్పుడు అధికారికంగా అమలు చేసింది. ప్రొఫెషనల్‌గా లేని పాత మెయిల్ ఐడీలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఇది ఒక గొప్ప అవకాశం. కొత్తగా, క్లీన్‌గా, ప్రొఫెషనల్ లుక్ ఉన్న జీమెయిల్ అడ్రస్‌ను ఎంచుకునే వీలు కలిగింది.
వివరాలు
జీమెయిల్ అడ్రస్ మార్పు - ముఖ్య నిబంధనలు
డేటా సేఫ్టీ: కొత్త జీమెయిల్ అడ్రస్‌కు మారిన తర్వాత కూడా పాత మెయిల్ ఐడీకి వచ్చే మెయిల్స్ మీకే వస్తాయి. అలాగే పాత అడ్రస్‌తో లాగిన్ అవ్వడం, మెయిల్స్ పంపడం కూడా కొనసాగుతుంది. పరిమితులు: యూజర్లు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే తమ జీమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవచ్చు. అదేవిధంగా జీవితకాలంలో గరిష్టంగా మూడు సార్లు మాత్రమే ఈ అవకాశం ఉంటుంది. అలియాస్ ఫీచర్ ప్రయోజనం: మీరు కొత్త అడ్రస్ ఎంచుకున్న వెంటనే పాత అడ్రస్ 'అలియాస్'గా మారుతుంది. మీ కాంటాక్ట్స్, ఫోటోలు, డ్రైవ్ ఫైల్స్, కొనుగోళ్లు, సబ్‌స్క్రిప్షన్లు ఏవి కూడా కోల్పోరు. అలాగే YouTube, Google Maps వంటి సేవల్లో కూడా ఎలాంటి మార్పు ఉండదు.
వివరాలు
జీమెయిల్ అడ్రస్ మార్చుకోవడం ఎలా? (Step-by-Step)
ముందుగాmyaccount.google.comవెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వాలి పైభాగంలో ఉన్నPersonal Info సెక్షన్‌ను ఓపెన్ చేయాలి అందులో Email ఆప్షన్‌ను క్లిక్ చేయాలి తర్వాత Google Account Email పై ట్యాప్ చేయాలి అక్కడ కనిపించే Change Google Account Email ఎంపికను సెలెక్ట్ చేయాలి మీకు కావాల్సిన కొత్త యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయాలి (అది అందుబాటులో ఉండాలి) Change Email పై క్లిక్ చేసి,కన్ఫర్మ్ చేయాలి చివరిగా స్క్రీన్‌పై కనిపించే సూచనలను పూర్తి చేస్తే, కొత్త అడ్రస్ యాక్టివ్ అవుతుంది మెయిల్ అడ్రస్ మార్పు చేసిన తర్వాత కొన్ని గూగుల్ ఫీచర్లలో తాత్కాలిక సమస్యలు రావచ్చు అని గూగుల్ తెలిపింది. ముఖ్యంగా క్రోమ్‌బుక్ లేదా రిమోట్ డెస్క్‌టాప్ ఉపయోగించే వారు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.