LOADING...
Google: గూగుల్‌కు 27 ఏళ్ల.. చిన్న ఆలోచన నుంచి అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ బ్రాండ్ వరకు!
గూగుల్‌కు 27 ఏళ్ల.. చిన్న ఆలోచన నుంచి అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ బ్రాండ్ వరకు!

Google: గూగుల్‌కు 27 ఏళ్ల.. చిన్న ఆలోచన నుంచి అంతర్జాతీయ సెర్చ్ ఇంజిన్ బ్రాండ్ వరకు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 27, 2025
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

సెర్చ్ దిగ్గజం గూగుగూగుల్ నేడు 27వ పుట్టినరోజును జరుపుకుంటోంది. 1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీ పీహెచ్‌డీ విద్యార్థులుగా ఈ సెర్చ్ ఇంజిన్‌ను ప్రారంభించారు. కంపెనీ అధికారికంగా సెప్టెంబర్ 4, 1998న స్థాపించినా గూగుల్ తమ అంతర్గత మైలురాళ్లను గుర్తు చేసుకుంటూ ప్రతేడాది సెప్టెంబర్ 27న పుట్టినరోజును జరుపుకుంటుంది. గూగుల్ అనేది 'గూగోల్' (Googol) అనే గణిత పదానికి ఆధారంగా ఉద్భవించింది. గూగోల్ అంటే 1 తర్వాత 100 సున్నాలు ఉన్న సంఖ్య, అంటే 10^100. ఈ పదాన్ని గణిత శాస్త్రజ్ఞుడు ఎడ్వర్డ్ కాస్నర్ మేనల్లుడు మిల్టన్ సిరోట్టా రూపొందించారు.

Details

 గూగుల్ పేరు మొదట 'బ్యాక్‌రబ్' 

సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ఈ పేరు ద్వారా తమ సెర్చ్ ఇంజిన్ అపారమైన సమాచారాన్ని ప్రజలకు అందించాలనే ఆశయాన్ని ప్రతిబింబించారు. అసలు గూగుల్ పేరు మొదట 'బ్యాక్‌రబ్' (BackRub)గా ఉండేది. 1997లో, లారీ పేజ్ సహోద్యోగి 'గూగోల్'ను తప్పుగా 'గూగుల్' (Google) అని ఉచ్చరించారు. ఈ ఉచ్చారణ అందరికి నచ్చి, డొమైన్ అందుబాటులో ఉన్నందున కొన్ని గంటల్లోనే google.comగా రిజిస్టర్ చేయబడింది. గ్యారేజీ నుంచి ప్రారంభమైన గూగుల్ ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సెర్చ్ ఇంజిన్‌గా, 2015లో ఆల్ఫాబెట్ ఇంక్ హోల్డింగ్ కంపెనీ ద్వారా యాజమాన్యాన్ని పొందింది. బిలియన్ల మంది వినియోగదారులు ప్రతి రోజు గూగుల్ ద్వారా సమాచారాన్ని పొందుతూ ఉంటారు.

Details

ముఖ్యాంశాలు 

1998లో సెర్గీ బ్రిన్, లారీ పేజ్ ప్రారంభం అసలు పేరు: BackRub "గూగోల్" నుంచి "గూగుల్" పేరు ఉద్భవం సెప్టెంబర్ 27న ప్రతి సంవత్సరం పుట్టినరోజు జరుపుకుంటారు 2015లో ఆల్ఫాబెట్ ఇంక్ ద్వారా పూర్తి యాజమాన్యం