
Google Map: గూగుల్ మ్యాప్‌లో ఈ రంగుల అర్థాన్ని మీరు అర్థం చేసుకుంటే.. మీ ప్రయాణం మరింత సులభం ..
ఈ వార్తాకథనం ఏంటి
ఈ రోజుల్లో మనం తెలియని ప్రదేశాలకు వెళ్లేటప్పుడు ముందుగా గూగుల్ మ్యాప్‌ను ఆశ్రయిస్తాము. స్నేహితుని ఇంటికి వెళ్తున్నా,కొత్త రెస్టారెంట్‌ను వెతుకుతున్నా,లేక ఆఫీసుకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ పరిస్థితిని తెలుసుకోవాలన్నా..ఈ యాప్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. అయితే, దారులపై గూగుల్ మ్యాప్స్‌లో కనపడే రకరకాల రంగుల గీతల్ని మీరు ఎప్పుడైనా గమనించారా? అవి కేవలం డిజైన్ కోసం మాత్రమే కాకుండా, ప్రత్యేకార్థాలతో ఉంటాయన్న విషయం మీకు తెలుసా?
వివరాలు
గూగుల్ మ్యాప్స్ రంగుల విశిష్టత:
గూగుల్ మ్యాప్స్‌లో ఉండే రంగుల గీతలు ప్రయాణికులకు మరింత స్పష్టమైన సమాచారం అందించేందుకు ఉపయోగపడతాయి. ఈ రంగులు ఒక్కోటి ప్రత్యేక అర్థాన్ని సూచిస్తాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే, మీరు ట్రాఫిక్‌కు బలయ్యే అవకాశాలు తగ్గుతాయి. ఇప్పుడు ఒక్కో రంగు ఏమి సూచిస్తుందో తెలుసుకుందాం. ఆకుపచ్చ రంగు ఈ రంగులో కనిపిస్తున్న దారి అంతటా ట్రాఫిక్ రద్దీ ఏమాత్రం లేదు. మీరు ఏరకమైన ఆటంకం లేకుండా సజావుగా ప్రయాణించవచ్చు. ఆలస్యం లేని దారి కావాలనుకునే వారికి ఇది ఉత్తమ మార్గం.
వివరాలు
పసుపు లేదా నారింజ రంగు
ఈ రంగులు మధ్యస్థమైన ట్రాఫిక్ స్థాయిని సూచిస్తాయి. అంటే రోడ్లపై కొంత మంది వాహనదారులున్నారు, కానీ పెద్ద ట్రాఫిక్ లేదన్నమాట. వాహనాలు కొంత నెమ్మదిగా కదులుతున్నప్పటికీ, ఎక్కువగా సమయం పట్టకపోవచ్చు. ఎరుపు రంగు ఈ రంగం కనిపించగానే అప్రమత్తంగా ఉండాలి. ఇది ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని సూచిస్తుంది. అదే రంగు ముదురు ఎరుపుగా మారితే, ఆ ప్రాంతంలో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయని లేదా ట్రాఫిక్ జామ్ ఉందని అర్థం చేసుకోవాలి.
వివరాలు
నీలం రంగు
మీరు ఒక గమ్యస్థానాన్ని సెర్చ్ చేసినప్పుడు, నీలం రంగు గీత కనిపిస్తే అది మీ ప్రయాణానికి గూగుల్ సూచించే ప్రాధాన్య మార్గం. ఇది సాధారణంగా వేగంగా వెళ్లే దారి లేదా సమర్థవంతమైన మార్గంగా పరిగణించబడుతుంది. ఊదా రంగు కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ ప్రధాన మార్గానికి బదులుగా మరో ప్రత్యామ్నాయ మార్గాన్ని ఊదా రంగులో చూపుతుంది. ఈ మార్గం కొంచెం పొడవుగా ఉండవచ్చు లేదా ట్రాఫిక్ తక్కువగా ఉండవచ్చు. ఇది రెండో ఎంపికగా వదిలిపెట్టే మార్గంగా ఉంటుంది.
వివరాలు
గోధుమ రంగు
గోధుమ రంగు రేఖలు లేదా నీడలు సాధారణంగా పర్వతాలు లేదా ఎత్తైన ప్రాంతాలను సూచిస్తాయి. ట్రెక్కింగ్ చేసే వారు లేదా ప్రకృతి ప్రాంతాల వైపు ప్రయాణించే వారు ఈ రంగాన్ని గమనిస్తే ఎత్తైన మార్గమని అర్థం చేసుకోవచ్చు. ఈ రంగులను తెలుసుకోవడం ఎందుకు అవసరం? గూగుల్ మ్యాప్స్‌ను చాలామంది వినియోగిస్తారు. కానీ అందులోని రంగుల అర్థం తెలియకపోవడం వల్ల ట్రాఫిక్‌లో చిక్కుకోవడం లేదా సరైన మార్గం దొరకక తప్పుదారి పడే అవకాశాలు ఉంటాయి. మీరు ఈ రంగులను సరిగ్గా అర్థం చేసుకుంటే, ట్రాఫిక్‌ను దాటేయడమే కాదు, సమయాన్ని కూడా ఆదా చేసుకోవచ్చు. అంతేకాదు, ప్రయాణం పూర్తిగా సౌకర్యంగా, వేగంగా జరుగుతుంది.