Loading...
Google Messages: గూగుల్ మెస్సేజెస్‌లో కొత్త ఫీచర్.. ఇక చాట్స్‌కు నచ్చిన థీమ్, బ్యాక్‌గ్రౌండ్!
గూగుల్ మెస్సేజెస్‌లో కొత్త ఫీచర్.. ఇక చాట్స్‌కు నచ్చిన థీమ్, బ్యాక్‌గ్రౌండ్!

Google Messages: గూగుల్ మెస్సేజెస్‌లో కొత్త ఫీచర్.. ఇక చాట్స్‌కు నచ్చిన థీమ్, బ్యాక్‌గ్రౌండ్!

వ్రాసిన వారు Moogati Shabari
Aug 28, 2026
10:41 am

ఈ వార్తాకథనం ఏంటి

ఆండ్రాయిడ్ యూజర్లకు గూగుల్ మెసేజెస్‌ కొత్త ఫీచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ఇకపై వ్యక్తిగత చాట్స్‌కు నచ్చిన రంగులు, బ్యాక్‌గ్రౌండ్ వాల్‌పేపర్లను సెట్ చేసుకునే అవకాశం కల్పించింది. 'చాట్ థీమ్స్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులోకి వస్తోంది. గత కొన్ని వారాలుగా బీటా వెర్షన్‌లో పరీక్షించిన అనంతరం గూగుల్ దీన్ని అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ప్రతి చాట్‌ను యూజర్ తనకు నచ్చిన విధంగా ప్రత్యేకంగా మార్చుకోవచ్చు. అయితే ఇందుకోసం RCS (Rich Communication Services) అవసరం ఉంటుంది. వ్యక్తిగత చాట్స్‌కు మాత్రమే కాకుండా గ్రూప్ చాట్స్‌కు కూడా నచ్చిన థీమ్‌ను ఎంచుకునే అవకాశం ఉంది.

వివరాలు

నచ్చిన రంగులు.. వాల్‌పేపర్

చాట్ థీమ్స్‌లో భాగంగా మెసేజ్ బబుల్స్‌కు నచ్చిన రంగును ఎంచుకోవచ్చు.

అలాగే చాట్ బ్యాక్‌గ్రౌండ్‌గా వాల్‌పేపర్‌ను సెట్ చేసుకోవచ్చు. ఇందుకోసం గూగుల్ ఇప్పటికే పలు రకాల బ్యాక్‌గ్రౌండ్లను అందిస్తోంది.

Animals, Landscapes, Space వంటి విభాగాల్లో గూగుల్ రూపొందించిన బ్యాక్‌గ్రౌండ్లను ఎంచుకోవచ్చు.

అంతేకాకుండా యూజర్లు తమ ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫొటోను కూడా చాట్ వాల్‌పేపర్‌గా సెట్ చేసుకోవచ్చు.

వాల్‌పేపర్‌ను ఎంచుకున్న తర్వాత దానికి అనుగుణంగా మెసేజ్ బబుల్స్ రంగులు ఆటోమేటిక్‌గా మారతాయి.

కొత్త థీమ్‌కు తగ్గట్టుగా మెసేజ్ బబుల్స్ కనిపించేలా గూగుల్ ఈ ఫీచర్‌ను రూపొందించింది.

అయితే యూజర్లకు నచ్చకపోతే రంగుల పాలెట్‌ను మాన్యువల్‌గా కూడా మార్చుకోవచ్చు.

వివరాలు

ఇతరులకు కనిపించని సీక్రెట్..

చాట్ థీమ్ ఫీచర్‌లో మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. యూజర్ సెట్ చేసుకున్న థీమ్ ప్రైవేట్‌గా ఉంటుంది.

అంటే మన ఫోన్‌లో మాత్రమే ఆ థీమ్ కనిపిస్తుంది. అవతలి వ్యక్తి ఫోన్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు.

అంటే మీరు ఓ వ్యక్తి చాట్‌కు ప్రత్యేకమైన వాల్‌పేపర్, రంగును సెట్ చేసుకున్నా.. ఆ వ్యక్తికి తన ఫోన్‌లో డిఫాల్ట్ చాట్‌గానే కనిపిస్తుంది.

ADVERTISEMENT

వివరాలు

చాట్ థీమ్ ఎలా సెట్ చేయాలంటే?

ముందుగా Google Messages యాప్‌ను ఓపెన్ చేయాలి. థీమ్ మార్చాలనుకుంటున్న చాట్‌ను సెలెక్ట్ చేయాలి.

పైభాగంలో ఉన్న వ్యక్తి లేదా గ్రూప్ పేరుపై ట్యాప్ చేయాలి. లేదంటే కుడివైపు పైభాగంలో ఉన్న మూడు చుక్కల (⋮) More ఐకాన్‌ను ట్యాప్ చేయాలి.

అందులో Chat theme ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కనిపించే కలర్ పాలెట్ నుంచి నచ్చిన రంగును ఎంచుకోవాలి.

Wallpapers విభాగంలో Choose a photo ఆప్షన్ ద్వారా గ్యాలరీలోని ఫొటోను ఎంచుకోవచ్చు. లేదా గూగుల్ అందించే ప్రీసెట్ కేటగిరీల నుంచి వాల్‌పేపర్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.

వాల్‌పేపర్ తర్వాత Nextపై ట్యాప్ చేయాలి. ప్రివ్యూ స్క్రీన్‌లో థీమ్ ఎలా కనిపిస్తుందో చూసుకోవచ్చు.

నచ్చితే Applyపై ట్యాప్ చేస్తే చాట్ థీమ్ సెట్ అవుతుంది.

ADVERTISEMENT

వివరాలు

అందరికీ ఎప్పుడు వస్తుంది?

ఒకవేళ మళ్లీ పాత డిజైన్‌కు వెళ్లాలనుకుంటే Chat theme మెనూలోని Reset to default ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ప్రస్తుతం ఈ ఫీచర్ అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో విస్తృతంగా అందుబాటులోకి వచ్చినట్లు కనిపించడం లేదు.

బీటా, స్టేబుల్ వెర్షన్లలోనూ కొంతమంది యూజర్లకు ఇంకా ఈ ఫీచర్ కనిపించడం లేదు.

మీ Google Messages యాప్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పుడు మూడు చుక్కల మెనూలో ఎరుపు రంగు డాట్ కనిపించే అవకాశం ఉంది.

ఆ డాట్ కనిపిస్తే కొత్త చాట్ థీమ్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు గుర్తించవచ్చు.

ADVERTISEMENT