LOADING...
Google Pixel 10 Pro: లీక్ అయిన Pixel 10 Pro డిజైన్‌! గూగుల్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సిద్ధం!
లీక్ అయిన Pixel 10 Pro డిజైన్‌! గూగుల్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సిద్ధం!

Google Pixel 10 Pro: లీక్ అయిన Pixel 10 Pro డిజైన్‌! గూగుల్ నుంచి కొత్త ఫ్లాగ్‌షిప్ డివైజ్ సిద్ధం!

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 05, 2025
11:33 am

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ ప్రియులకు మళ్లీ అతి త్వరలో టెక్ హంగామా రాబోతుంది. ప్రముఖ టెక్ కంపెనీ గూగుల్,ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న "Made by Google" ఈవెంట్‌లో తన తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లైన Pixel 10 సిరీస్‌ను అధికారికంగా పరిచయం చేయనుంది. ఈ నేపథ్యంలో, ఇందులో భాగమైన Pixel 10 Pro మోడల్‌కు సంబంధించిన పూర్తి రూపకల్పన ఇటీవల ముందుగానే ఇంటర్నెట్‌లో లీక్ కావడం ఆసక్తిని పెంచుతోంది. ఈ ఫోన్ ఎలా ఉండబోతుందో ఆ వివరాల్లోకి వెళ్దాం.

వివరాలు 

వెర్టికల్ కెమెరా సెటప్‌లో మొత్తం మూడు రియర్ కెమెరాలు 

ప్రముఖ లీక్‌స్టర్ ఆన్ లీక్స్ సహకారంతో ఆండ్రాయిడ్ హెడ్లైన్స్ ప్రచురించిన తాజా 3D రెండర్లలో, Pixel 10 Pro డిజైన్ అన్ని కోణాల నుంచి చూపించబడింది. ఈఫోన్ వెనుక భాగం,గత సంవత్సరం విడుదలైన Pixel 9 Pro మాదిరిగానే కనిపిస్తోంది. దీనివెనక భాగంలో ఉన్న పిల్ ఆకారంలోని వెర్టికల్ కెమెరా సెటప్‌లో మొత్తం మూడు రియర్ కెమెరాలు ఉన్నాయి. అంతేకాకుండా,కెమెరా సెటప్ పక్కన LED ఫ్లాష్నూ ఏర్పాటు చేశారు.ఫోన్ వెనుక భాగంలో గూగుల్ "G" లోగో క్రోమ్ ఫినిష్తో మెరుస్తుండగా,మిగిలిన బ్యాక్ ప్యానెల్‌కి మ్యాట్ టెక్స్చర్డ్ ఫినిష్‌ను అందించారు. ఇప్పటికే గూగుల్,ఈడిజైన్‌ను"Obsidian"కలర్ వేరియంట్ రూపంలో తన సోషల్ మీడియా ద్వారా టీజర్‌గా విడుదల చేయడం వల్ల ఈ లీక్‌కు మరింత బలం చేకూరింది.

వివరాలు 

పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లు అన్నీ కుడి వైపు

ఈ ఫోన్ ఫ్రేమ్ గ్లోస్సీ ఫినిష్తో ఉండే అవకాశముందని లీక్ వివరాలు చెబుతున్నాయి. ఫోన్ మూలల (కార్నర్స్) డిజైన్ కూడా కొద్దిగా గుండ్రంగా ఉండేలా ఉంటుంది. పక్కన భాగాలను పరిశీలిస్తే, పవర్ బటన్, వాల్యూమ్ బటన్‌లు అన్నీ కుడి వైపు ఉంచారు. ఎడమ వైపు పూర్తిగా ఖాళీగా ఉండేలా డిజైన్ చేశారు. అలాగే ఫోన్ పైన,కింద భాగాల్లో యాంటెన్నా లైన్లతో కూడిన స్టైలిష్ లుక్ను ఇవ్వాలని ప్రయత్నించారు. ఫోన్‌కు సంబంధించి స్క్రీన్ పరిమాణం ఇంకా వెల్లడించనప్పటికీ, ఫ్రంట్ డిజైన్ మాత్రం ప్రాచుర్యం పొందింది. బెజెల్స్ చాలా పలుచగా ఉండగా, టాప్ సెంటర్‌లో చిన్న హోల్-పంచ్ కట్‌ఔట్ ద్వారా సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేశారు.

వివరాలు 

వీటిలో మూన్ స్టోన్, జాడే కొత్తగా పరిచయం కానున్న కలర్లు

ఇప్పటి వరకు ఒబిసిడియన్ కలర్ వేరియంట్ మాత్రమే లీక్ అయినా,గూగుల్ ఈ ఫోన్‌ను మొత్తం నాలుగు రంగులలో విడుదల చేయబోతోందని సమాచారం. అందులో Obsidian, పోర్సలిన్, మూన్‌స్టోన్, జాడే కలర్ వేరియంట్లు ఉంటాయని తెలుస్తోంది. వీటిలో మూన్‌స్టోన్, జాడే రంగులు పూర్తిగా కొత్తవి. గత సంవత్సరం ఉన్న హాజెల్, రోజ్ ఖ్వార్ట్జ్ వేరియంట్లకు బదులుగా ఈ రెండు కొత్త రంగులను తీసుకురావాలని గూగుల్ నిర్ణయించిందని సమాచారం. ఇకపోతే, కెమెరా సామర్థ్యం, చిప్‌సెట్, ఇతర ఫీచర్లు, ధరకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే అధికారికంగా వెల్లడికావచ్చు.