Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 స్మార్ట్‌ఫోన్ల సిరీస్ వచ్చేసింది.. మోడళ్లు, ధరలు, ఫీచర్లు ఇవే..
ఈ వార్తాకథనం ఏంటి
గూగుల్ తన పిక్సెల్ సిరీస్‌లో భాగంగా నాలుగు కొత్త స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రొ, పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్, పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్ మోడళ్లను బుధవారం విడుదల చేసింది. అధునాతన కెమెరాలు, ఏఐ ఆధారిత ఫీచర్లు, కొత్త చిప్‌సెట్‌లతో వీటిని రూపొందించింది. ఈ సిరీస్‌లో టెన్సర్ జీ6 చిప్‌సెట్‌తో పాటు టైటాన్ ఎం3 సెక్యూరిటీ చిప్‌ను అందించారు. ఇది ఫోన్‌లోనే పనిచేసే ఏఐ ఫీచర్లను మరింత మెరుగుపరుస్తుంది. ఈ నాలుగు మోడళ్ల ఫీచర్లు, ధరలు, ఆఫర్లపై ఓ లుక్కేద్దాం.
వివరాలు
గూగుల్ పిక్సెల్ 11
పిక్సెల్ 11 సిరీస్‌లో బేస్ మోడల్‌గా పిక్సెల్ 11ను తీసుకొచ్చారు.
ఇందులో 6.3 అంగుళాల OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. గరిష్ఠంగా 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
వెనుక భాగంలో మూడు కెమెరాల సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్‌ను అందించారు.
సెల్ఫీల కోసం ముందు భాగంలో 10.5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 4,985mAh బ్యాటరీని ఇందులో అమర్చారు.
30W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ధరల విషయానికి వస్తే.. 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.89,999గా ఉంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మోడల్‌ను రూ.1,04,999కు తీసుకొచ్చారు.
వివరాలు
గూగుల్ పిక్సెల్ 11 ప్రొ
పిక్సెల్ 11 ప్రొలో 6.3 అంగుళాల LTPO OLED డిస్‌ప్లేను అందించారు. ఇది గరిష్ఠంగా 3,600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది.
వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ ఉండగా.. సెల్ఫీల కోసం 42 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు.
ఫోన్‌లో 4,850mAh బ్యాటరీ ఉంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం లభిస్తుంది.
ఈ ఫోన్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,19,999గా ఉంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మోడల్ ధర రూ.1,34,999గా నిర్ణయించారు.
వివరాలు
పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్
పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్‌లో 6.8 అంగుళాల డిస్‌ప్లేను అందించారు.
వెనుకవైపు 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్, ముందువైపు 42 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
ఈ ఫోన్‌లో 5,115mAh బ్యాటరీని అమర్చారు.
45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం 30 నిమిషాల్లో బ్యాటరీ 75 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది.
ధరలు ఇలా..
పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్ 12GB ర్యామ్, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.1,34,999గా ఉంది. 12GB ర్యామ్, 512GB స్టోరేజ్ మోడల్‌ను రూ.1,49,999కు విక్రయించనున్నారు.
వివరాలు
ధరలు ఇలా..
పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్‌లో 8 అంగుళాల ఇన్నర్ OLED డిస్‌ప్లే, 6.5 అంగుళాల OLED కవర్ స్క్రీన్ ఉన్నాయి. వెనుకవైపు 48 మెగాపిక్సెల్ వైడ్ కెమెరాను అందించారు.
రెండు స్క్రీన్లకు వేర్వేరుగా 10 మెగాపిక్సెల్ కెమెరాలను ఇచ్చారు. ఇందులో 4,750mAh బ్యాటరీ ఉంది. 30W ఫాస్ట్ ఛార్జింగ్ సదుపాయం లభిస్తుంది.
పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్‌ను ఒకే వేరియంట్‌లో అందిస్తున్నారు. 16GB ర్యామ్, 512GB స్టోరేజ్‌తో వచ్చే ఈ మోడల్ ధర రూ.1,86,999గా ఉంది.
వివరాలు
రంగులు, ఆఫర్లు ఇవే..
పిక్సెల్ 11ను హైబిస్కస్, ఫ్రాస్ట్, ఆబ్సిడియన్, పిస్తాచియో రంగుల్లో తీసుకొచ్చారు. పిక్సెల్ 11 ప్రొ, పిక్సెల్ 11 ప్రొ ఎక్స్‌ఎల్ మోడళ్లు కాన్యాన్, ఫాగ్, ఆలివ్, ఆల్ మ్యాటీ ఆబ్సిడియన్ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
పిక్సెల్ 11 ప్రొ ఫోల్డ్ మాత్రం ఆలివ్ రంగులో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త పిక్సెల్ స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు ఆగస్టు 20 నుంచి ప్రారంభం కానున్నాయి.
గూగుల్ స్టోర్‌తో పాటు ఫ్లిప్‌కార్ట్‌లో వీటిని కొనుగోలు చేయవచ్చు.
వివరాలు
రంగులు, ఆఫర్లు ఇవే..
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే రూ.10,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
అలాగే 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ఇవే కాకుండా పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకునే వారికి రూ.9,000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కంపెనీ అందిస్తోంది.
కొత్త పిక్సెల్ ఫోన్ల కొనుగోలుతో ఆరు నెలల 'గూగుల్ ఏఐ ప్రొ' సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభించనుంది.