Loading...
Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌ లాంచ్‌ నేడు.. ఈవెంట్‌ను ఎలా చూడాలంటే?
గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌ లాంచ్‌ నేడు.. ఈవెంట్‌ను ఎలా చూడాలంటే?

Google Pixel 11: గూగుల్ పిక్సెల్ 11 సిరీస్‌ లాంచ్‌ నేడు.. ఈవెంట్‌ను ఎలా చూడాలంటే?

వ్రాసిన వారు Moogati Shabari
Aug 12, 2026
01:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్‌ తన తాజా పిక్సెల్‌ స్మార్ట్‌ఫోన్లను నేడు 'మేడ్‌ బై గూగుల్‌' ఈవెంట్‌లో ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Pixel 11 సిరీస్‌ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సిరీస్‌లో సాధారణ Pixel 11, ప్రో మోడల్‌, పెద్ద స్క్రీన్‌తో Pixel 11 Pro XL, ఫోల్డబుల్‌ ఫోన్‌ Pixel 11 Pro Fold ఉండనున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు Pixel Watch 5ను కూడా గూగుల్‌ విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే కొత్త పిక్సెల్‌ డివైజ్‌ల కోసం జెమినీ (Gemini)లో తీసుకొచ్చిన కొత్త ఫీచర్లను కూడా సంస్థ వెల్లడించనుంది.

వివరాలు

ఈవెంట్‌ లైవ్‌స్ట్రీమింగ్‌ ఎలా చూడాలి?

'మేడ్‌ బై గూగుల్‌' ఈవెంట్‌ నేడు సాయంత్రం 6 గంటలకు ETలో ప్రారంభం కానుంది.

భారత కాలమానం ప్రకారం ఇది ఆగస్టు 13న తెల్లవారుజామున 3:30 గంటలకు జరుగుతుంది.

ఈ ఈవెంట్‌ను గూగుల్‌ తన అధికారిక యూట్యూబ్‌ ఛానల్‌లో లైవ్‌స్ట్రీమ్‌ చేయనుంది.

అలాగే సంస్థ ఆన్‌లైన్‌ స్టోర్‌లోనూ లైవ్‌స్ట్రీమ్‌ లింక్‌ను అందుబాటులో ఉంచనుంది.

వివరాలు

Tensor G6 చిప్‌తో Pixel 11?

ప్రామాణిక Pixel 11లో 6.3 అంగుళాల Actua OLED డిస్‌ప్లే ఉండొచ్చని సమాచారం.

ఇది 2,424×1,080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌తో పాటు 60Hz నుంచి 120Hz వరకు అడాప్టివ్‌ రిఫ్రెష్‌ రేట్‌ను సపోర్ట్‌ చేసే అవకాశం ఉంది.

ఈ ఫోన్‌లో గూగుల్‌ సొంతంగా అభివృద్ధి చేసిన Tensor G6 చిప్‌సెట్‌, Titan M3 సెక్యూరిటీ చిప్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది.

ర్యామ్‌ విషయానికి వస్తే 12GB, 16GB ఆప్షన్లు ఉండొచ్చని సమాచారం. స్టోరేజ్‌ 256GB, 512GB వేరియంట్లలో లభించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

Pixel 11 కెమెరా, బ్యాటరీ వివరాలివే..

Pixel 11లో 48MP మెయిన్‌ కెమెరాతో పాటు 13MP అల్ట్రా-వైడ్‌ కెమెరా ఉండొచ్చని సమాచారం.

ఇందులో గరిష్ఠంగా 30x Super Res Zoom సపోర్ట్‌ ఉండే అవకాశం ఉంది.

సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 10.5MP ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ఫోన్‌లో 4,985mAh బ్యాటరీ ఉండొచ్చని అంచనా. 30W లేదా 45W వైర్డ్‌ ఛార్జింగ్‌తో పాటు Qi2 వైర్‌లెస్‌ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్‌ లభించే అవకాశం ఉంది.

ADVERTISEMENT

వివరాలు

Pro మోడల్‌లో మరిన్ని అప్‌గ్రేడ్‌లు..

Pixel 11 Proలోనూ ఇదే తరహా ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. అయితే డిస్‌ప్లేను మరింత మెరుగుపరచడంతో పాటు కెమెరా సామర్థ్యాలను కూడా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది.

ముఖ్యంగా అల్ట్రా-వైడ్‌ కెమెరాకు మ్యాక్రో సపోర్ట్‌, టెలిఫోటో కెమెరాకు ఆప్టికల్‌ జూమ్‌ అందించే అవకాశం ఉంది.

Pixel 11 Pro XLలో పెద్ద డిస్‌ప్లే ఉండనుంది. చిన్న సైజు Pro మోడల్‌లో ఉండే కెమెరా సెటప్‌నే ఇందులోనూ అందించే అవకాశం ఉంది.

అయితే Pro XLలో మరింత పెద్ద బ్యాటరీతో పాటు వేగవంతమైన ఛార్జింగ్‌ సపోర్ట్‌ లభించొచ్చని సమాచారం.

ఇక ఫోల్డబుల్‌ ఫోన్‌ Pixel 11 Pro Fold విషయానికి వస్తే.. 8అంగుళాల ఇన్‌నర్‌ OLED డిస్‌ప్లే, బయట 6.4 అంగుళాల డిస్‌ప్లే ఉండనున్నట్లు తెలుస్తోంది.

ADVERTISEMENT