LOADING...
New Gemini AI Models: గూగుల్ కొత్త జెమినీ ఏఐ మోడల్స్ విడుదల.. ఇక పూర్తి ఫోకస్ ఏఐ ఏజెంట్లపైనే
గూగుల్ కొత్త జెమినీ ఏఐ మోడల్స్ విడుదల.. ఇక పూర్తి ఫోకస్ ఏఐ ఏజెంట్లపైనే

New Gemini AI Models: గూగుల్ కొత్త జెమినీ ఏఐ మోడల్స్ విడుదల.. ఇక పూర్తి ఫోకస్ ఏఐ ఏజెంట్లపైనే

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
08:25 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక డెవలపర్స్ ఈవెంట్ Google I/Oలో కొత్త జెమినీ ఏఐ మోడల్స్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా Gemini 3.5 Flashమోడల్‌ను మంగళవారం నుంచే అందుబాటులోకి తీసుకొచ్చింది. మరింత శక్తివంతమైన Gemini 3.5 Pro వచ్చేనెలలో విడుదల కానుంది. ఈ కొత్త మోడల్స్ వేగంగా పని చేయడంతో పాటు యూజర్ల తరఫున పనులు పూర్తి చేసే"ఏజెంటిక్ ఏఐ" సామర్థ్యాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు గూగుల్ వెల్లడించింది. గూగుల్ తెలిపిన వివరాల ప్రకారం,కొత్త Gemini మోడల్స్ పనితీరు పరంగా OpenAI GPT-5.5,Anthropic Claude Opus4.7 వంటి ప్రముఖ ఏఐ మోడల్స్‌కు సమానంగా ఉంటాయి. అయితే ఇవి తక్కువ ఖర్చుతో వేగంగా పనిచేయగలవని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు.

వివరాలు 

ఏఐ ఏజెంట్లను నడిపించేందుకు జెమిని 3.5 ఫ్లాష్

జెమిని 3.5 ఫ్లాష్ ప్రత్యేకంగా ఏఐ ఏజెంట్లను నడిపించేందుకు రూపొందించారు. ఒకేసారి అనేక ఏజెంట్లు కలిసి పెద్ద ప్రాజెక్టులను కూడా పూర్తి చేయగలవని గూగుల్ డీప్‌మైండ్ సీటీఓ కోరాయ్ కవుక్చువోగ్లు వెల్లడించారు. గంటల తరబడి స్వయంగా పనిచేసి కోడింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే సామర్థ్యం దీనికి ఉందన్నారు. ఇక OpenClaw తరహాలో పనిచేసే "Gemini Spark" అనే కొత్త 24/7 ఏఐ అసిస్టెంట్‌ను కూడా గూగుల్ పరిచయం చేసింది. ఇది యూజర్ల తరఫున పనులు చేయడం, Gmail, Docs వంటి Workspace యాప్స్‌లో సహాయం చేయడం వంటి ఫీచర్లతో వస్తోంది. ప్రస్తుతం కొంతమంది యూజర్లకు మాత్రమే ట్రయల్ రూపంలో అందుబాటులోకి తీసుకొస్తుండగా, వచ్చే వారం AI Ultra సబ్‌స్క్రైబర్లకు బీటా వెర్షన్ ఇవ్వనున్నారు.

వివరాలు 

వ్యక్తిగత సమాచారం చూపించనున్నDaily Brief

అదే సమయంలో కోడింగ్ ప్లాట్‌ఫామ్"Antigravity"ను కూడా గూగుల్ పూర్తిగా మార్చింది. ఇప్పుడు ఇది కేవలం కోడింగ్‌కే కాకుండా అనేక ఏఐ ఏజెంట్లను నిర్వహించే ప్లాట్‌ఫామ్‌గా పనిచేస్తుంది. ఒక ఏజెంట్ వెబ్‌సైట్ రూపొందిస్తే,మరోటి బ్రాండ్ డిజైన్ తయారు చేయడం,ఇంకొకటి ప్రోడక్ట్ ప్లానింగ్ చేయడం వంటి పనులు చేయగలవని గూగుల్ తెలిపింది. ఇక Gemini యాప్‌కూ కొత్త రూపు తీసుకొస్తున్నారు."Neural Expressive" పేరుతో కొత్త డిజైన్, యానిమేషన్స్,కలర్స్, హ్యాప్టిక్ ఫీడ్‌బ్యాక్ వంటి ఫీచర్లు అందించనున్నారు. అలాగే "Daily Brief" అనే కొత్త ఫీచర్ ద్వారా యూజర్ మెయిల్స్, క్యాలెండర్, టాస్క్‌ల ఆధారంగా వ్యక్తిగత సమాచారం చూపించనుంది. ఈ ఫీచర్ అమెరికాలో Google AI Plus, Pro, Ultra సబ్‌స్క్రైబర్లకు ఈ వారం నుంచే అందుబాటులోకి రానుంది.

Advertisement