LOADING...
గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు
ఈ ఫోన్ లో దాదాపు 5,000mAh బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది

గూగుల్ తొలి ఫోల్డబుల్ Pixel Fold స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 22, 2023
12:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

గూగుల్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పిక్సెల్ ఫోల్డ్ పూర్తి వివరాలను I/O 2023లో తెలియజేయచ్చు లేదా అక్టోబర్ లో పూర్తి వివరాలు ప్రకటించచ్చు. 9to5Google తాజా నివేదిక ఇప్పుడు ఫోన్ కు సంబంధించిన కొత్త సమాచారాన్ని అందించింది. సామ్ సంగ్ గెలాక్సీ Z ఫోల్డ్4, OPPO Find N2 కంటే గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ కు పెద్ద బ్యాటరీ ఉంటుందని, ఇది మిగిలిన ఫోన్ల కంటే ఎక్కువ బరువు ఉంటుందని పేర్కొంది. గత నవంబర్‌లో, గూగుల్ ఫోల్డబుల్ ఫోన్ చర్చనీయాంశంగా మారింది. ఫోల్డబుల్ ఫోన్ Pixel 7 Pro కంటే భారీగా ఉంటుంది. ఫోన్ లో దాదాపు 5,000mAh బ్యాటరీ సామర్ధ్యం ఉంటుంది

స్మార్ట్‌ఫోన్

Galaxy Z Fold4 , Find N2 కంటే Pixel Foldలో పెద్ద బ్యాటరీ ఉంటుంది

Galaxy Z Fold4 (4,400mAh), Find N2 (4,520mAh) కంటే Pixel Foldలో పెద్ద బ్యాటరీ ఉంటుంది. ఇది లోపలికి మడతపెట్టే డిజైన్‌ తో వస్తుంది. ఇందులో గ్లాస్ బాడీ, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్ ఉంటుంది. Pixel Fold ప్రధాన ప్యానెల్ 7.69-అంగుళాల QHD+ (1840x2208 పిక్సెల్‌లు) LTPO AMOLED స్క్రీన్‌ను 120Hz రిఫ్రెష్ రేట్, 5:6 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. ఇది 5.79-అంగుళాల కవర్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇందులో 64MP సోనీ IMX787 ప్రైమరీ రియర్ స్నాపర్, 12MP IMX386 అల్ట్రా-వైడ్ సెన్సార్, 10.8MP S5K3J1 టెలిఫోటో లెన్స్ ఉండవచ్చు. మెయిన్, కవర్ డిస్ప్లేలలో 9.5MP కెమెరా ఉంటుంది.