Page Loader
భారతదేశంలో  అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్
Pixel 7 Pro ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ. 84,999

భారతదేశంలో అతిపెద్ద తగ్గింపుతో అందుబాటులో ఉన్న Pixel 7 Pro ఫోన్

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 06, 2023
06:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

సామ్ సంగ్ Galaxy S23 ప్రభావంతో గూగుల్ Pixel 7 Pro భారతదేశంలో అత్యధిక తగ్గింపుతో వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్ పై ఆకర్షణీయమైన ఎక్స్ఛేంజ్ డీల్‌ను కూడా అందిస్తోంది. ఈ గూగుల్ Pixel 7 Pro ఫోన్ ఆధునిక డిజైన్, అధిక-రిజల్యూషన్ డిస్‌ప్లే తో వస్తుంది.అప్డేటెడ్ సాఫ్ట్‌వేర్ తో పాటు అద్భుతమైన కెమెరా ఈ ఫోన్ ప్రత్యేకతలు. ఫ్లిప్ కార్ట్ ప్రస్తుత ధరలో Pixel 7 Proని కొనుగోలు చేయడం వినియోగదారులకు లాభం. భారతదేశంలో, Pixel 7 Pro 12GB/128GB కాన్ఫిగరేషన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. టైటాన్ M2 సెక్యూరిటీ కో-ప్రాసెసర్ తో , 12GB LPDDR5 RAM, 128GB UFS 3.1 స్టోరేజ్‌తో లభిస్తుంది.

గూగుల్

ఈ ఫోన్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది

Pixel 7 Pro 30W వైర్డ్, 23W వైర్‌లెస్, రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీతో వస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్స్ లో 5G, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPS, NFC తో పాటు టైప్-సి పోర్ట్ ఉన్నాయి. దీని ధర ఫ్లిప్‌కార్ట్ లో రూ. 84,999. అయితే, డీల్ లో భాగంగా, ఫ్లిప్ కార్ట్ రూ.11,000 HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై తక్షణ తగ్గింపుని అందిస్తుంది. అదనంగా, రూ.22,000వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ఉంది. ఇది ఫోన్ ధరను రూ.51,999.కి తగ్గిస్తుంది.