Pixel 7a, Pixel Fold ధర ఎంతో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
Pixel 7a, Pixel Fold లాంచ్ కు నెలలు గడువు ఉండగానే ధర, స్పెసిఫికేషన్, డిజైన్ గురించి ఆన్లైన్ లో లీక్ అయింది. ఈమధ్యనే ఐఫోన్ 15 Ultra ధర కూడా ప్రకటించారు. ఇది 2023 చివరి నాటికి లాంచ్ కాబోతుంది.
Pixel 6a విక్రయిస్తున్న అదే పాత ధరకు Pixel 7a కూడా అమ్మకం జరుగుతుందని ఈ లీకైన సమాచారం ద్వారా తెలిసింది. రాబోయే Pixel A సిరీస్ ఫోన్ ధర $449గా ఉంటుందని నివేదికలు చెప్తున్నాయి. భారతదేశంలో దాదాపు రూ.37,185.
Pixel 6a రూ. 43,999 ధరతో ప్రారంభం అయింది. కానీ, ఇప్పుడు చాలా తక్కువ ధరకు అమ్ముడవుతోంది. Pixel 7a మెరుగైన ఫీచర్స్ తో మార్కెట్ లోకి వస్తుంది.
ఐఫోన్
సామ్ సంగ్ గేలక్సీ z Fold ధరతో సమానంగా ఉన్న Pixel Fold ధర
US మార్కెట్ ధర పాత మోడల్ ధర ఉంటే మాత్రం ఇతర మార్కెట్‌ల ధరలు అలాగే ఉండే అవకాశం ఉంది.
Pixel Fold విషయానికొస్తే, ఇది గూగుల్ నుండి వచ్చిన మొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్. పిక్సెల్ ఫోల్డ్ $1,799 ధర ట్యాగ్‌తో వస్తుంది. అంటే భారతదేశంలో దాదాపు రూ. 1.49 లక్షలు. ఇటీవల ప్రకటించిన సామ్ సంగ్ Galaxy Z Fold 4 ధరకు దాదాపు సమానం. భారతదేశంలో, ఈ సామ్‌సంగ్ ఫోల్డబుల్ ఫోన్ రూ. 1.54 లక్షలకు అందుబాటులోకి వచ్చింది.
గూగుల్ I/O 2023 అనే వేడుకలో Pixel 7a, Pixel Fold గురించి ప్రకటించే అవకాశం ఉంది. ఇఈ వేడుక వచ్చే ఏడాది ఏప్రిల్ లేదా మేలో జరుగుతుంది.